Friday, July 19, 2019

శుభోదయము By Ravishankar M

మిత్రులకు

శివోరక్షతు.........

సీసము:-

తనువున తేజంబుఁ దరిగిబోవగ, మేను
         
        ముడుతలు వడిపోయె, ముదిమి సోకె,

దంతము లపటిమ దరిగి బోసిగ యయ్యె

          కనుచూపు యెన్నడోఁ గరిగిఁ బోయె,

వెల్ల వేసిన రీతి వెంట్రుకల్పొడ సూపె,

          కరచరణము లింత కదలకుండె,

ఇంద్రియావళులెల్ల నింగితమ్ము మరచి,

          కోరి దిరుగు చుండు, కోతి రీతి

       
   

తే!!గీ!!

మనసు మాత్రమింతైనను మారకుండ
దిక్కుమాలిన కోర్కెలం దిరుగుచుండె
మరణశయ్యపై నున్నను మార్పురాదు
ఎట్లు గాతువో మనుజుల నిందుమౌళి

No comments:

Post a Comment