Sunday, July 7, 2019

శుభవారముBy Mudigonda Ravishankar 

మిత్రులకు

శివానుగ్రహ ప్రాప్తిరస్తు

మహాదేవా !.........‌..

కన్నులూడబెరికి
కానుకట్లీయంగాను
కాను  నే, కన్నప్పను........

పుత్రునీ  హతమార్చి
కూర వండిబెట్టంగాను
కాను, నే,  చిరుతొండనంబిని.......

కనులారా నిన్ను గాంచంగ
కాయము నగ్నిలో కాల్చుకొన,
కాను, నే, నందనారును‌.....

కాలునీ బారి పడనోపక
కౌగలించ నీ రూపు
కాను, నే, మార్కండేయు.......

కంఠమున కురిబెట్టుక
కాలకంఠు లింగము సరిజేయ
కాను, నే, గుగ్గిల నాయనారు.....

వెలలేని రత్నాల దెచ్చి
అర్పణంబు జేయగా
కాను, నే భుజగపతిని.......

సన్నని దారాల
సదనంబు నిర్మింప
కాను, నే లూతమ్మును......

 కావలి బంటుగా
వాకిట నిలుపంగ
కాను, నే  బాణాసురుని.....

శివుడే సర్వస్వమంచు
తిరముగా బలుకంగ
కాను, నే నాయనారును....

కలిగిన యిసుమంత భక్తి,
హిమనగమె  నాకంచు,
మదిలోన నమ్మియున్న
నీదు భక్తుడేను నీలకంఠ

..

.

No comments:

Post a Comment