🌹భక్తి భావనలు🌹
జ్ఞాన సాధనకు భక్తి, వైరాగ్యం, సన్యాసం, తపస్సు, పఠనం, సాధన, జపం లాంటి అనేక మార్గాలున్నాయి. వాటిలో సులభంగా ఫలితాన్నిచ్చేది భక్తి మార్గం. స్వరూప-స్వభావాలు, అనురూప-వ్యతిరేక గుణ భేదాలను బట్టి భక్తి అనేక రకాలుగా ఉంటుంది. అందులో ముఖ్యంగా తొమ్మిది రకాలున్నాయని, ఇవే నవవిధ భక్తిమార్గాలుగా లోకంలో ప్రసిద్ధి పొందాయని పురాణ కథనం. అవి- శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనలు.
ఎవరెవరు ఏ భక్తి మార్గాన పయనించి ముక్తులయ్యారో భాగవతం స్పష్టంగా తెలుపుతోంది. సత్పురుషుల గుణగణాలు వినడం వల్ల మానవులు మంచివారుగా మారడానికి దోహదపడేది శ్రవణం. పరీక్షిత్తు ఈ మార్గం ద్వారానే మోక్షాన్ని పొందాడని భాగవతం వెల్లడిస్తోంది.
సర్వవ్యాపి అయినవాడి మూర్తిని మదిలో ప్రతిష్ఠించుకుని స్మరించడం ద్వారా ఆయన కృపకు పాత్రులు కావడం స్మరణ భక్తి లక్షణం. ఇది ‘నామ-రూప స్వరూప (స్మరణలు)’ అని మూడు రకాలు. ప్రహ్లాదుడు, ధ్రువుడు లాంటివారు ఈ మార్గం ద్వారా భగవదనుగ్రహం పొందారు.
సర్వేశ్వరుణ్ని స్నేహితుడిగా భావించి ప్రవర్తించడం సఖ్యభక్తికి ఉదాహరణ. కుచేలుడు, గోపికలు ఈ మార్గానుయాయులు.
‘నీవు తప్ప మరెవరూ నన్ను కాపాడేవారు లేరు’ అని శరణు కోరడం ఆత్మనివేదన. ద్రౌపది, గజేంద్రుడు వంటివారు దీనికి ఉదాహరణ.
పాద సేవనం, అర్చన, దాస్యాల ద్వారా ఆ సర్వోత్తముడి అనుగ్రహానికి పాత్రులైనవారూ ఉన్నారు. ఇవేమీ చేయడానికి శక్తిలేనివారు మనస్ఫూర్తిగా కేవలం నమస్కారం చేసినా చాలు. ఆ అంతర్యామి ప్రేమకు పాత్రులవుతారు. అదే ‘వందన భక్తి’ లక్షణం.
ఎవరైతే ఏ కోరికలూ లేకుండా నిష్కామకర్మలు చేస్తూ భగవదారాధన చేస్తారో, వారు సత్వగుణ స్వభావం కలవారవుతారని, వారే నిజమైన భక్తిభావవిదులని, అలాంటివారే సత్వర జ్ఞానాన్ని పొందగలరని భాగవతం చెబుతోంది.
తపస్సంపన్నుడిగా మారిన కుమారుడు కపిల మహాముని జ్ఞానాన్ని చూసి శిష్యురాలిగా మారింది కన్నతల్లి అయిన దేవహూతి. ఆమె జిజ్ఞాసతో అడిగిన ప్రశ్నలకు- ‘ప్రతివారూ జ్ఞాన సముపార్జనకు ఎనిమిది విధాలైన సాధనలు చేస్తూ, భావనా భక్తిని కలిగి ఉండాలి’ అని జవాబు చెప్పాడు. ఆ ఎనిమిది వరసగా- అహింస, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, సహనం, మనోనిగ్రహం, తపస్సు, ధ్యానం, సత్యం.
‘నీ, నా’ అనే భేదం కలిగిన భక్తులు ఇతరుల భక్తిని సహించలేరు. వారు తమ భక్తే గొప్పదని, తమను మించిన భక్తులెవరూ ఉండరని భావించుకుంటూ ఉంటారు. ఇలాంటివారిని ‘తామస భక్తులు’ అంటారు.
తాము భక్తులమని అందరూ గుర్తించాలని, ఆ రూపంలో తమ కీర్తి ప్రతిష్ఠలు, సిరిసంపదల కోసం పాకులాడేవారిని ‘రాజస భక్తులు’ అంటారు.
కర్మ ఫలాన్ని భగవదర్పణం చేసి, తెలిసిగాని, తెలియకగాని చేసిన పాపాలను పోగొట్టుకోవడం కోసం భగవంతుణ్ని శరణు కోరేవారు ‘సాత్విక భక్తులు’ అనిపించుకుంటారు.
పరమాత్మ సృష్టించిన ఈ లోకంలో మానవాళి మాత్రమే కాకుండా పశుపక్ష్యాదులు, తరు-లతా-గుల్మాదులు, తుమ్మెదలు లాంటి కీటకాలు తదితరాలూ ఆ సర్వవ్యాపకుడి పట్ల వాటివాటి స్థాయుల్లో భక్తి భావాన్ని ప్రదర్శించగలుగుతాయి. ఫలితంగా కర్మ పరిపాక స్థితి, సాధనా పటిమ,
నిబద్ధత, నిలకడ, నిశ్చలతల స్థాయిని బట్టి అవీ ముక్తి పొందడానికి అవకాశాలు ఏర్పడతాయనీ చెబుతోంది భాగవతం. వాటికి అనేక ఉదాహరణలు సైతం ఇచ్చింది ఆ పురాణం.
🌹🙏🏻🌹Forwarded by MALLIKHARJUN

No comments:
Post a Comment