Friday, July 26, 2019

ఉచ్ఛదశనుతెచ్చె యుద్భటారాధ్యుడు/
కాకతీయ ప్రభుత కాలమందు/
ఆదరణనుపొందె ఆరాధ్య కూటమి/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

ఆంధ్రదేశమందు ఆరాధ్య విభవము,/
మనదు యునికి పెంచ మనసు నిలిపి/
నింగి నేల కలిపె నీలకంఠారాధ్య/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

సత్వులు ముదిగొండ శంకరారాధ్యులు/
పీఠమధివసించె ప్రేమతోడ/
ప్రాకటముగ గొనెను ప్రాధమిక చర్యలు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

నడకలు ముదిగొండ నాగలింగారాధ్యులు/
నేర్పిరైతి పీఠ నిర్వహణకు/
వారి కృషి తెలియని వారెవ్వరయ్యరో/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

అదనున శివలెంక అమృతలింగారాధ్య/
పంచుకొనెను పీఠ భాద్యతలను/
ఓర్పుతోడ నెగ్గె ఒడుదుడుకులనెన్నొ/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

విరివిగ ముదిగోండ వీరేశలింగాఖ్య/
సలిపిరెన్నొ మేలు సంస్కరణలు/
భాద్యతలను గొనిరి బహుకాలమును వీరు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

సరసులు ఇవటూరి సానంద యారాధ్యు/
లొసగె తమదు సేవలుత్తమముగ/
భక్తిమార్గమునకు బాటలు వేసిరి/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

జగమున ముదిగొండ జ్వాలాపతీలింగ/
శాస్త్రిగారి పేరు శాశ్వతముగ/
నిలచునట్లు పీఠ నిర్వహణము జరిగె/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏By Subrahmanyam M

గాంచ మూలఁపల్లి రాజశేఖరశాస్త్రి/
గారు నిలిపె పీఠ గౌరవమును/
సాంప్రదాయములను చక్కగ నెఱపిరి/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

ఫలములిడె సిరి(శ్రీ)పతి పండితారాధ్యుల/
శరభఽరాధ్యులెంతొ శమముతోడ/
పీఠమునకునెంతొ పేరును తెచ్చిరి/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

శంకరుండె దిగెను శంకరశాస్త్రిగా/
నిర్మలాంతరంగ నియమములతొ/
క్రొత్తపుంతలెన్నొ గొనెమన పీఠము/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

యోగబలముతోడ ఊర్ధ్వముఖుడై తాను/
మూర్తిమంతమైన స్ఫూర్తినొసగి/
గుప్తనిధులనొసగె గురుశివానందులు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

ఉనికి చాట యత్తలూరి మృత్యుంజయ/
శర్మగారు నేడు శక్తితోడ/
ఉద్యమించి మనకు యొజ్జయై నిలచిరి/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏

No comments:

Post a Comment