నిర్మల స్పటికాకృతిం - ఆధ్యాత్మిక విశ్లేషణ - వైజ్ఞానిక విశ్లేషణ :forwaded by MVMRAO
Episode - 1
"నిర్మల స్ఫటికాకృతిం", "స్పటిక మణి మయీ"... ఇత్యాది... పదాలను మనం స్తోత్రాలు, స్తుతులలో గమనిస్తాం. దైవస్మరణ సమయంలో కాంతిని వర్ణించినప్పుడు స్పటికాల ప్రస్తావన ఉండి తీరుతుంది.
ఏమిటి ఈ స్పటికాలు (crystals) ? ఏమిటి వాటి నిర్మలత్వం? ఈ రోజుల్లో చాలామంది స్పటిక మాల వేసుకోవడం, స్పటికాలను (లాకెట్లు,గోళాలు) ధరించడం ,స్పటికం తోచేసిన శివలింగాలు, గణేశ ప్రతిమలు మొదలైన వాటిని పూజించడం, రేకీ (reiki), ప్రాణిక్ హీలింగ్ (prani healing) పద్ధతుల్లో వాడడం మనం గమనిస్తున్నాము. పిరమిడ్లు, యంత్రాలు, మండలాలు మొదలైన సామగ్రి లో కూడా స్పటికాలను (అనేక రకాల వాటిని) వాడుతున్నట్లు మనకు తెలుసు.
ఇంగ్లీషులో స్పటికాన్ని, "క్రిస్టల్"(crystal) అంటారు. గ్రీకు భాషలో క్రిష్టలోస్ అంటే స్పష్టమైన మంచు అని అర్థం. స్పటిక నిర్మలత స్పష్టత మంచు ముక్కలా ఉండడమే దీనికి కారణం. ఇతరదేశాలలో కొందరి నమ్మకం ఏమిటంటే పరమేశ్వరుడు పవిత్ర జలాన్ని, స్వర్గము నుండి భూమి మీదకు....పొయ్యగా, ఆకాశంలో ఆ జలం మంచు స్పటికాలుగా మారిందని, ఆ స్పటికాలను దేవతలు మానవాళి రక్షణ ఆశీస్సుల కోసం శిలలుగా మార్చారని......నిజమే కావచ్చు. దివి నుండి భువికి వచ్చిన జలాలు, స్పటికాలు.... భూమి లోపల నుండే కదా ఉద్భవించాయి. ఒక కోణం నుండి చూస్తే దైవశక్తి అయిన ధవళ కాంతి, స్పటిక రూపంలో ఒక ఆకారంగా మారిందని భావించవచ్చు. ఎందుకంటే స్వచ్ఛమైన స్పటికం, కాంతిలో కనబడదు. ఆ కాంతిలో కలిసిపోయి ఉంటుంది. అయినా ఒక భౌతికమైన ఆకారం ఉంది. స్పటికాల కున్న ఆధ్యాత్మిక శక్తి మొదలైన విషయాలను మున్ముందు పరిశీలిద్దాం. భూమిపై ఉన్న మట్టిలో ఇంచుమించు 80% ప్రాణవాయువు, ఇసుక రాయి (oxygen & silicon) ఉంటాయని ఖనిజ శాస్త్రం చెబుతోంది. స్పటికాల లో ఉన్న ముఖ్య అణువులు ఇవే. దీనిని సిలికాన్ డయాక్సైడ్ (silicon di oxide) అంటారు. వాడుక భాషలో "క్వార్ట్జ్" (quartz) అంటారు.
అతి ఎక్కువ ఉష్ణోగ్రత (600 degrees), పీడనము (pressure) లేక ఒత్తిడి కలిగిన నీరు (భూగర్భంలో)...ఈ ఇసుకరాయిని కరిగించి అక్కడ జరిగిన ఈ మార్పు వలన, శిలాద్రవం (మాగ్మా/లావా)భూమి పైభాగానికి వస్తుంది.
వచ్చి, అక్కడున్న శిలారాశుల లోనికి చొచ్చుకొనిపోయి చోటు చేసుకుంటుంది. ఆ రాళ్ళలో అప్పటికే Si O 2. అణువుల.... మాలిక్యూల్స్ (molecules)ఉంటే... వాటిలో ఇలా , బంధం ఏర్పర్చుకొని, క్రమేపీ చల్లబడి... స్ఫటిక రూపంలో, ఆరు ముఖాల (six sided/hexagonal) స్పటికాలుగా పెరుగుతాయి. ఒకవేళ అలా రాశుల్లో ఇసుక అణువులు లేకపోతే (పాలరాయి వంటివి)ఆ మాగ్మా ప్రక్కలకి ప్రాకి, రెండు వైపులా కొనలు (terminations)... ఉండే స్పటికాలుగా, పలకలు దేరి, షడ్బుజాలతో.... పెరగడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది.
స్పటికాలు అన్ని దేశాలలో... కొండ ప్రదేశాలలో... లావా ప్రవాహాలు ఏర్పడిన శిలారాసులలో చూడవచ్చు. ఇవి అతి చిన్న ఆకారం నుండి ..... మూడు, నాలుగు అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. బ్రెజిల్, ఆల్ఫ్స్ పర్వాత శ్రేణుల్లో, పిరనీస్, మడగాస్కర్ ప్రదేశాలలో అత్యద్భుతమైన స్పటికాలను... త్రవ్వకం చేస్తున్నారు. మనదేశంలో రాజస్థాన్ ప్రాంతంలో కూడా వివిధ రకాలైన స్పటికాలు లభిస్తాయి. సాధారణంగా స్పటికాలు పెరిగి, నిశ్చితమైన ఆకారం ధరించడానికి, కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. బ్రెజిల్ స్పటికాలు 120 కోట్ల సంవత్సరాల వయస్సువని ...." కార్బన్ డేటింగ్ పద్ధతి" లో కనుక్కున్నారు.(సశేషం)
-----శ్రీ మధుర కవి శ్యామలరావు

No comments:
Post a Comment