Thursday, July 11, 2019

🕷🕸🕷🕸🕷🕸🕷🕸
*ఊర్ణ నాభి న్యాయము* forwaded by  S P VARAPRASAD

    *ఊర్ణ నాభః  అనగా సంస్కృతం లో సాలె పురుగు అని అర్థం.*

 సాలె పురుగు తన నోటి నుంచి దారము ను తీసి గూడు అల్లుతుంది. మరలా కొంత కాలము నకు ఆగూటిని తన నోటి లోనికి వెనుకకు తీసేసుకుంటుంది.

సాలె పురుగు నోటి నుంచి వచ్చిన దారము తన శరీరమే కానీ అన్యం కాదు. ఆ దారము ను తిరిగి తన శరీరం లో ఏవిధంగా కలిపి వేసుకుంటుందో అదే విధంగా బ్రహ్మము సృష్టి ని చేసి  మరలా ఈ సృష్టి ని తన లో లయము      చేసుకొనును.
             
అందుచే ఉన్నదంతా బ్రహ్మమే . బ్రహ్మ మే తన నుంచి సృష్టి గా వ్యాపించి తిరిగి తన లోనే లయమై పోవును.
         
"బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా "

*అంటే యజ్ఞం చేసేది బ్రహ్మమే,  హవిస్సులు బ్రహ్మమే,  అగ్నీ  బ్రహ్మమే ,హుతమయ్యేదీ బ్రహ్మ మే, కర్మ చేసేది, అనుభవించేది  సర్వం బ్రహ్మ మయం.*
                        *బ్రహ్మార్పణమస్తు*.

No comments:

Post a Comment