Monday, July 22, 2019

రెండు  ఎత్తైన భవనాల మధ్య ఒక తాడు కట్టబడి ఉంది.దాని మీద ఒక వ్యక్తి నడవసాగాడు.వందల అడుగుల ఎత్తున అత్యంత జాగ్రత్తగా అతను నడవ సాగాడు.
చేతిలో పొడవయిన కర్ర ఉంది...
బుజాన అతని కొడుకు ఉన్నాడు.

అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు....
అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రెండో భవనం వైపు వచ్చాడు,అందరూ చప్పట్లు కొట్టారు.కేరింతలలో ఆహ్వానం పలికారు...
చేతులు కలిపారు ఫోటో లు తీసుకున్నారు.

నేను ఈ తాడు మీద తిరిగి అవతలికి వెళ్లాలను కుంటున్నాను వెళ్లగలనా? అతను ప్రశ్నించాడు...
వెళ్లగలవు, వెళ్లగలవు జనం సమాదానం.
నా మీద నమ్మకం ఉందా?..ఉంది,ఉంది. మేం పందానికి అయినా సిద్దం!  అయితే మీ లో ఎవరయినా నా భుజం మీద ఎక్కండి, అవతలకి తీసుకు పోతాను!
అక్కడంతా నిశబ్దం..
జనం మాటలు ఆగి పోయాయి...
ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు,
ఉలుకు లేదు, పలుకు లేదు,
నమ్మకం వేరు, విశ్వాసం వేరు.

విశ్వాసానికి సర్వస్వ సమర్పణ భావం కావాలి.ఈరోజుల్లో దైవభక్తిలో మనం కోల్పోతున్నది ఇదే....
దేవుడు అంటే నమ్మకమే ... కానీ విశ్వాసం లేదు..By Spk Prasad 

No comments:

Post a Comment