Monday, July 8, 2019

*ఇల్లు లక్ష్మీనివాసం కావాలంటే*By SPK PRASAD

ఇంట్లో కి ధనం, సకల సంపదలు అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీ దేవికి నచ్చేట్టు శుభ్రంగా ఉండాలట.  ఇంటి ప్రధాన ద్వారం  ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే,  లక్ష్మీదేవీ ప్రసన్నమవుతుందని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. ఇంతకీ గుమ్మం ముందు ఏమి ఉంటె లక్ష్మి రావటానికి ఆస్కారం వుందో, ఓసారి చూద్దాం.. ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉండాలి. పొద్దున్నే చీపురుతో శుభ్రపర్చి, నీళ్ళు చల్లి ముగ్గు వేయాలి. ఇది తప్పనిసరిగా ఉషస్సు కు ముందే చెయ్యాల్సిన పని.  గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులు ఉంచాలి.
లక్ష్మీదేవికి ఇష్టమైన  పువ్వులను గుమ్మానికి అటుఇటూ పెడితే.. అవి రోజూ మార్చి కొత్తవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. పూవులను రోజూ మార్చ బద్దకించి కాయితం పూలో, ప్లాస్టిక్ పూలో పెట్టవద్దు సుమా!                  
గుమ్మం కనుక ఈశాన్యం మూల ఉంటె గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది.
గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్ళు తీసుకుని, దానిలో నీళ్ళు నింపి దానిలో రాగి రూపాయల బిళ్ళలు, పచ్చ కర్పూరం, ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి.
ఇలా చెయ్యడం ద్వారా దరిద్రం పోయి, సమస్యలు పరిష్కరించబడి, తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుఅవకాశం ఉంటుంది.  ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే లక్ష్మీ దేవి  శ్రీవారు లేనిది ఒంటరిగా రాదు. కావున ఇంట్లో పూజ గదిలో శ్రీవారి దగ్గర అవాహనాది పూజ సపర్యలు మరియు మంత్ర జపం చేసిన లక్ష్మి యంత్రం పెట్టిన కూడా మంచి శుభఫలములు కలుగును.                                                   మరిఆలస్యందేనికి ? ??                                /// శుభష్య శీఘ్రమ్///

No comments:

Post a Comment