72.భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితా(లలితా సహస్రనామం లో ఒకనామం)🙏🏻Forwarded by MALLIKHARJUN
ఇది పదహారు అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు “భండసైన్య వధోద్యుక్తశక్తి విక్రమహర్షితాయై నమః” అని చెప్పాలి.
భండసైన్య = భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని,
వధోద్యుక్త = సంహరించడానికి సంసిద్ధురాలైన,
శక్తి విక్రమహర్షితా = తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూచి ఆనందించినది.
అజ్ఞానానికి సంబంధించిన ఆసురీ ప్రవృత్తులను సంకేతించే భండా సురాదులను, వారి అనుచరులను నశింపచేసి, సుజ్ఞానవంతంగా మనలను తీర్చిదిద్ది, ఆత్మజ్ఞానాన్ని కలుగజేసే - మనలోని జ్ఞానసంపర్క భావాలే - అమ్మ వారి సైన్యంగా తెలుసుకోవాలి.
జీవుని యందు ద్వైత వృత్తులుండును అవియే ద్వందములు ఈ ద్వైత వృత్తుల ఆధారంగా జీవుడు సృష్టి యందు జీవనము కొనసాగించును. పగలు-రాత్రి,అడా - మగా, మంచి - చెడు, లాభం - నష్టం, జయం - అపజయం, సుఖము - దుఃఖము, ఇట్టి ద్వందములు మహా సైన్యము వలే ఉంది జీవుని బంధించి వేయును , ఈ ద్వందములు నసిస్తే గాని జీవికి ప్రశాంతత లభించదు. అతని యందు జీవాత్మ భావము -దేహాత్మా భావము, బుద్ధి -మనస్సు, అతఃకరణములు -బహి:కరణములు,పశుప్రవృత్తి - పతిప్రవృత్తి రెండు రకములుగా ఉండును.
ఈ ద్వంద భావములు నశించుటకు జీవుడు జ్ఞానము, వైరాగ్యము, యోగము ఆశ్రయించవలెను. అందు తగ్గ సాధన కొందరు గృహస్థు ఆశ్రమ ధర్మంలో ,కొందరు సన్యాస ధర్మంలో సాధన చేస్తారు.. పూజ వ్రతము నియమము, దీక్ష, విగ్రహారాధన ,నవవిధ భక్తి మార్గంలో అనుకూల మైన విధానాన్ని అనుసరిస్తూ మొదటి దశలో ఈ సాధనల ద్వారా మనసుకు ప్రశాంతత బుద్ధికి ఏకాగ్రత కలుగ చేసుకుంటారు.. ఈ మొదటి దశలోనే భగవంతుడు పట్ల అంకిత భావం ఉండాలి భక్తి ఆత్రుత ఉండాలి.. నోటిలో చదివే మంత్రాలు మనసుతో పలకాలి అప్పుడే భక్తి పారవశ్యంతో కళ్ళు చెమ్మగిల్లుతుంది అది అనిర్వచనియమైన అనుభూతి అట్టి స్థితిలో భగవంతుడు రూపాన్ని మనసులో నిలుపుకొని ధ్యానం చేయాలి.. అప్పుడు ఆ తల్లి అశ్వరూడై, జ్వాలమాలినిగా... కిరిచక్ర రధములో.. శ్రీ దేవి మన సాధన అనే ఆయుధాలను ఉపయోగించి మనలోని బండాసురుడుని అంతం చేసి అంటే దైత్య వృత్తులను, ద్వంద స్వభావలను సంహరిస్తుంది.. అట్టి స్థితిలో సాధన ఆగకూడదు మరింతగా పూర్వ వాసనాలకు లొంగి గమ్యానికి చేరనీయ కుండా కర్మ అడ్డుపడుతుంది అప్పుడు జీవుడికి , ఆత్మకు , బుద్ధికి మనసుకి మధ్య జరిగే సంఘర్షణ లో తల్లి సహాయం పొందాలి ఆమె శక్తి ఆమె కుండలిని ఆమె , జీవిత చక్రంలో పడి మునిగిపోకుండా , జీవుని ఘ్యమ్యం చేరుకునే విధంగా తోడుగా ఉంటుంది.. అయితే సాధన ఒక్కటి సరిపోదు.. ప్రతి జీవుని యందుకు ఉన్న వికారాలు క్రమముగా దూరం చేసుకుంటేనే ఏకాగ్రత లభిస్తుంది.. ప్రతి మనిషిలోను ఒక బండాసురుడు లాంటి పూర్వజన్మ కర్మ లను సంహరించే తల్లి పాదాలను శరణు కోరాలి.. నిత్య జీవితం ధర్మ బద్ధముగా గడపాలి..ఏ పని చేస్తున్నా దైవ ధ్యాస స్మరణతో చేయడం వల్ల మనసు ధ్యానం పట్ల త్వరగా ఏకాగ్రత పొందుతుంది.
ఈ నామానికి ఈ క్రింది అర్ధాలు చెప్పుకోవచ్చును.
1) భండాసురుణ్ణి, అతని సైన్యాన్ని వధించడం కోసం సంసిద్ధులై వున్న తన శక్తి సైన్యాల విక్రమాన్ని చూసి ఆనందించినది.
2) అజ్ఞానాన్ని నిర్మూలించి, ఆత్మజ్ఞానాన్ని కలుగచెయ్యడం కోసం మనలో పనిచేసే జ్ఞాన సంపర్క భావాలను చూసి ఆనందించేది.
ఓం శ్రీ మాత్రే నమః...
(శక్తి ఆరాధన శ్రీచక్ర ఉపాసన)

No comments:
Post a Comment