ఆధునికుల సంశయములను తొలగించి/
మన సనాతన మత మహిమ తెలిపి/
మేలుగొల్పి, నిలిపె మ్లేచ్ఛులయొరవడి/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏. సకలజనుల నడుమ సంచరించిన యతి/
దీనపాలనయెడ దీక్షబూనె/
కడలియంత కరుణ గల మహాపెరియవ/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏. ఆదిశంకరులకు అనుయాయి యాతడు/
కంచి పీఠమునకు కార్యకర్త/
జ్ఞానయోగమొసగె జనులకీ తాపసి/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏. చంద్రశేఖరేంద్ర చరణారవిందములు/
ముక్తినొసగు భయ విముక్తి జేసి/
నరుడు గాడు యతడు నడయాడు దైవము/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏 By Subrahmanyam M

No comments:
Post a Comment