🙏పంచారామ దర్శనము🙏 By Subrahmanyam M
ఆంధ్ర రాజధాని అమరావతికి జన/
కృష్ణవేణి ఝరులకంజలించి/
ఆర్తితోడ గొల్తు నమరలింగేశ్వరుని/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏
భీమవరము మీదు ధామమై విలసిల్లె/
గౌతమీ తటాన కనులపంట/
సాధుజనుల వేల్పు సోమేశ్వరుండిట/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏
పాలకొల్లులోన భక్తజన బాంధవా/
క్షీర రామలింగ క్షితి పతీవు/
పాడిపంటలొసగు పశుపతివీవుగా/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏
దక్షవాటియనగ దక్షిణామూర్తియౌ/
భీమలింగమునకు ప్రియముగూర్చు/
కీర్తిగొన్న మాణికేశ్వరి సన్నిధౌ/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏
సౌమ్యులుండు తావు సామర్లకోటలో/
పేరుగొన కుమారభీమలింగ/
భక్తజనుల రక్ష పంచయారామములు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏
ఆంధ్ర రాజధాని అమరావతికి జన/
కృష్ణవేణి ఝరులకంజలించి/
ఆర్తితోడ గొల్తు నమరలింగేశ్వరుని/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏
భీమవరము మీదు ధామమై విలసిల్లె/
గౌతమీ తటాన కనులపంట/
సాధుజనుల వేల్పు సోమేశ్వరుండిట/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏
పాలకొల్లులోన భక్తజన బాంధవా/
క్షీర రామలింగ క్షితి పతీవు/
పాడిపంటలొసగు పశుపతివీవుగా/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏
దక్షవాటియనగ దక్షిణామూర్తియౌ/
భీమలింగమునకు ప్రియముగూర్చు/
కీర్తిగొన్న మాణికేశ్వరి సన్నిధౌ/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏
సౌమ్యులుండు తావు సామర్లకోటలో/
పేరుగొన కుమారభీమలింగ/
భక్తజనుల రక్ష పంచయారామములు/
శివపురీశ! దేవ! చిద్విలాస!/🙏
No comments:
Post a Comment