Sunday, November 26, 2017

17/11/17, 3:19:52 PM: ‪+91 94407 61176‬: సీ: చితిలోని భస్మ మ్ము చిత్రమ్ము గానీవు
పూసుకు తిరిగెడి పుణ్యమూర్తి !
గరళమే ఆశనము కంఠమున పాములు
దిక్కులే వస్త్రాలు దీనబంధు!
ఒడలెల్లఁ నిండుగా జడలన్ని విరబోసి
ప్రేత భూమిని తిరుగు ప్రేమమూర్తి !
చేత కపాలమ్ము భూతనాథుడవివు
ముసలి ఎద్దే నీకు ముందరగును
గీ::ఇన్ని అవలక్ష నములన్ని  యున్నగాని
జగతి నేలేడి ఏకైక జెట్టివీవు !
యెట్టు లైతివి పార్వతి న్ కట్టుకున్న
పుణ్య ఫలమున గాదె సౌజన్య మూర్తి!
శరణు కరుణాంత రంగ !శ్రీ శంభు లింగ!

No comments:

Post a Comment