11/11/17, 6:33:23 PM: +91 98660 49721: శ్రౌత , స్మార్త , నిత్య , నైమిత్తిక , కామ్య కర్మలు అంటే 👇
శ్రౌత కర్మలు - అగ్నిష్టోమ , అతిరాత్ర , ఆప్తోర్యామ , వాజపేయ , పౌండరీక , సాంతపన , అశ్వమేధాది సప్త సోమయాగాలు.
స్మార్త కర్మలు - (పంచదశ కర్మలు)
గర్భాదానం
, పుంసవనం , సీమంతోన్నయనం , జాతకర్మ , నామకరణం , అన్నప్రాశనం , చౌలం ,
ఉపనయనం , ప్రాజాపత్య , వైశ్వదేవ , ఆగ్నేయ , సౌమ్య , గోదాన వ్రతాలు ,
స్నాతకం , వివాహం.
నిత్య కర్మలు - సంధ్యావందనం , అగ్నికార్యం , బ్రహ్మయజ్ఞం. (బ్రహ్మచారులకు )
సంధ్యావందనం , ఔపాసనం. (గృహస్థులకు)
తల్లి - తండ్రులు లేని వారికి పితృ తర్పణం.
నైమిత్తిక కర్మలు - ఉపాకర్మ , గాయత్రీ పాడ్యమి, వరలక్ష్మీ వ్రతం , కేదార వ్రతం , సత్య నారాయణ వ్రతం మొ.వి.
కామ్య కర్మలు - గ్రహ శాంతులు , అభిషేకాదులు , వివిధ రకాలైన హోమాలు🕉🕉🕉🕉🕉
No comments:
Post a Comment