తల్లితండ్రుల గొప్పదనం గురించి శాస్త్రాలలో చెప్పబడిన విధానం 🔹
💥 ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి
🌷 ఆకాశము కన్నా ఉన్నతుడు తండ్రి
💥 ఒక్కసారి తల్లికి,తండ్రికి నమస్కరించిన గోదానము చేసిన పుణ్యము వచ్చును.
💥 సత్యం తల్లి ...... జ్ఞానం తండ్రి.
💥 పదిమంది ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు.
వందమంది ఆచార్యుల కంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రి కంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి.
💥
తల్లితండ్రులకు సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ,
వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ
దక్కుతాయి.
💥 ఎవరు మాతృదేవతను సుఖముగ ఉంచరో, సేవించరో వారి శరీర మాంసాలు శునక మాంసము కన్నా హీనం
💥
ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ, కన్నతల్లి కంట కన్నీరు
తెప్పించిన లక్ష గోవులు దానమిచ్చినా, వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినా ఆ పాపం
పోదు.
💥 తను చెడి తన
బిడ్డలను చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న
తల్లిని నిరాదరించినా అది తప్పే అని ధర్మశాస్త్రం చెబుతోంది
💥 తల్లిని మించిన దైవం లేదు. గాయత్రిని మించిన మంత్రం లేదు.
No comments:
Post a Comment