Tuesday, November 14, 2017

08/11/17, 2:32:09 PM: Padma Tirupati: #హైందవ ధర్మంలో....
#పూజించు అనే పదానికి అసలైన అర్థం:
"సేవించి ఉపయోగం పొందు" అని.,

1) తల్లి దండ్రులను పూజించు
2) గురువులను పూజించు
3) గోవులను పూజించు
4) తులసిని పూజించు
5) రావి చెట్టును పూజించు
6) ఉసిరిక చెట్టును పూజించు

#తల్లిదండ్రులను పూజించడం అంటే వారిని గౌరవించి, వారి మాటకు విలువ ఇచ్చి, వ్రృధ్దాప్యంలో అక్కున చేర్చుకుని సంతోషంగా జీవయాత్రను పూర్తి చేయించడం, తద్వారా అలా చేసిన వారి పిల్లలు ఉన్నత స్థితికి చేరి వారి మలి జీవితం ఆనందంగా గడపగలుగుతారు.
( #Imp_Note:మన పిల్లలు ఉన్నత స్థితికి చేరుటకు ఈ భూమిపై ఉన్న ఏకైక సూత్రం మన తల్లిదండ్రులను గౌరవించటమే, వాళ్ళను వ్రుధ్దాప్యంలో బాగా చూచుకోవడమే, అది చేయకుండా ఇంకేం చేసినా పిల్లలు వ్రృధ్దిలోకి రారు)

#గురువులను పూజించడం అంటే వేల రూపాయలు ఖర్చుపెట్టి గురు పూజ చేయడం కాదు; గురువులను గౌరవించి, సేవించి వారి నుండి జ్ఞానాన్ని పొందడం.

#గోవులను పూజించడం అంటే పోటీపడి గోపూజలు చేయడం కాదు; గోవులను కాపాడి, వ్రృధ్ది చేసి, గోఉత్పత్తులను ఉపయోగించడం, తద్వారా ఆరోగ్యంగా జీవించడం.

#తులసిని పూజించడం అంటే చెట్టు ఒరిగిపోయి/విరిగిపోయి/చనిపోయేటట్లు పసుపు కుంకుమ పూలతో నింపేయడం కాదు; తులసి చెట్లను ఎక్కువగా పెంచి దానిలోని ఔషధ గుణాలతో ఉపయోగం పొందవలెనని.

#రావి చెట్టును పూజించడం అంటే ఎక్కువగా రావి చెట్లను నాటి భూవాతావరణం పైకి వచ్చే Ultra Violet Rays / Cosmic Pollution తగ్గించుకోమని.

#ఉసిరిక: ఇదీ అలాగే, ఉసిరికలోని ఔషధ గుణాలను ఉపయోగపెట్టుకో అని, #కనకధారా స్తోత్రం వెలువడడానికి ఉసిరి కారణం అయింది కదా; ఇక్కడ లాజిక్ అర్థం చేసుకుందాం; కనీసం ఉసిరిక అన్నా ఇంట్లో ఉండాలి, అంటే ఉసిరికను ప్రతి రోజూ సేవించాలి, అంటే తినాలి అని అర్థం. (ఉసిరిక కాక పోయినా కనీసం #నిమ్మ)

అంతేగాని పసుపు కుంకుమ పూలు కొబ్బరికాయ కొట్టేసి చేతులు దులిపేసుకుని పోవడం కాదు.,
దానికి మళ్ళీ ప్రతిఫలాన్ని ఆశించడం కాదు.,
ఫలితం రాక పోతే దేవుణ్ణి మార్చడం కాదు.,

No comments:

Post a Comment