Friday, November 10, 2017

10/11/17, 7:44:31 AM: ‪+91 76739 89798‬: వందేమాతరం

*ఒక చిన్న మాట*

హైందవ ధర్మంలో....

పూజించు అనే పదానికి అసలైన అర్థం:
"సేవించి ఉపయోగం పొందు" అని.,

*1) తల్లి దండ్రులను పూజించు*
*2) గురువులను పూజించు*
*3) గోవులను పూజించు*
*4) తులసిని పూజించు*
*5) రావి చెట్టును పూజించు*
*6) ఉసిరిక చెట్టును పూజించు*

*తల్లిదండ్రులను పూజించడం* అంటే వారిని గౌరవించి, వారి మాటకు విలువ ఇచ్చి, వృధ్దాప్యంలో అక్కున చేర్చుకుని సంతోషంగా జీవయాత్రను పూర్తి చేయించడం, తద్వారా అలా చేసిన వారి పిల్లలు ఉన్నత స్థితికి చేరి వారి మలి జీవితం ఆనందంగా గడపగలుగుతారు.
( #Imp_Note:మన పిల్లలు ఉన్నత స్థితికి చేరుటకు ఈ భూమిపై ఉన్న ఏకైక సూత్రం మన తల్లిదండ్రులను గౌరవించటమే, వాళ్ళను వృధ్దాప్యంలో బాగా చూచుకోవడమే, అది చేయకుండా ఇంకేం చేసినా పిల్లలు వృధ్దిలోకి రారు)

*గురువులను పూజించడం* అంటే వేల రూపాయలు ఖర్చుపెట్టి గురు పూజ చేయడం కాదు; గురువులను గౌరవించి, సేవించి వారి నుండి జ్ఞానాన్ని పొందడం.

*గోవులను పూజించడం* అంటే పోటీపడి గోపూజలు చేయడం కాదు; గోవులను కాపాడి, వృధ్ది చేసి, గోఉత్పత్తులను ఉపయోగించడం, తద్వారా ఆరోగ్యంగా జీవించడం.

*తులసిని పూజించడం* అంటే చెట్టు ఒరిగిపోయి/విరిగిపోయి/చనిపోయేటట్లు పసుపు కుంకుమ పూలతో నింపేయడం కాదు; తులసి చెట్లను ఎక్కువగా పెంచి దానిలోని ఔషధ గుణాలతో ఉపయోగం పొందవలెనని.

*రావి చెట్టును పూజించడం* అంటే ఎక్కువగా రావి చెట్లను నాటి భూవాతావరణం పైకి వచ్చే Ultra Violet Rays / Cosmic Pollution / Air pollution తగ్గించుకోమని.

*ఉసిరిక:* ఇదీ అలాగే, ఉసిరికలోని ఔషధ గుణాలను ఉపయోగపెట్టుకో అని, #కనకధారా స్తోత్రం వెలువడడానికి ఉసిరి కారణం అయింది కదా; ఇక్కడ లాజిక్ అర్థం చేసుకుందాం; కనీసం ఉసిరిక అన్నా ఇంట్లో ఉండాలి, అంటే ఉసిరికను ప్రతి రోజూ సేవించాలి, అంటే తినాలి అని అర్థం. (ఉసిరిక కాక పోయినా కనీసం #నిమ్మ)

అంతేగాని పసుపు కుంకుమ పూలు కొబ్బరికాయ కొట్టేసి చేతులు దులిపేసుకుని పోవడం కాదు.,
దానికి మళ్ళీ ప్రతిఫలాన్ని ఆశించడం కాదు.,
ఫలితం రాక పోతే దేవుణ్ణి మార్చడం కాదు.,

*శుభోదయం*

No comments:

Post a Comment