Tuesday, November 14, 2017

13/11/17, 6:44:40 AM: Ivaturi Umashankar: *ॐ*        *శంకరుని వద్ద ఉన్నది*
                ~~~~~~~~~~

*శంకరా! భక్తుణ్ణి కాబట్టి*

*నీవు తినే తిండిని నాకు పెట్టు అని అడుగుదామంటే,నీ ఆహారం విషం.అది అందరినీ చంపేది.*

*నీవు పెట్టుకొనే ఆభరణాన్ని కోరుదామంటే,అది బుసలు కొడుతూ భయాన్ని కల్గించే పాము.*

*పోనీ నీవు ధరించే వస్త్రాన్ని యాచిద్దామంటే,అది గజాసురుని చర్మం.అసహ్యమైనది.*

*నీ వాహనాన్ని ఇయ్యి అని ప్రార్థిద్దామంటే అది ముసలి ఎద్దు.*

*మరి నాకు ఏమివ్వగలవు?నీ దగ్గర ఇంతకుమించి ఏముంది?*

  *నిరంతరం నీ పాదారవిందాలలొ స్థిరంగా ఉండే భక్తిని మాత్రం ఇవ్వు.అది చాలు.దాని వల్ల నాకు అన్నీ ప్రాప్తిస్తాయి.*

*విశేషం*   
  *ఆహారం,ఆభరణం,వస్త్రం,వాహనం శాశ్వతమైనవి కావు.చెడిపొయేవే.*
      *అవి ఐహిక భోగానుభవానికి అవసరం అవుతాయి.*
    *సుఖంగా బ్రతకాలని కోరడం పశు(బంధ)ప్రవృత్తిని సూచిస్తుంది.*
      *కాబట్టి అవి పరమేశ్వరుణ్ణి కొరేవి కావు.*
        *సంసారబంధాలనుంచీ ఏదైతే తప్పిస్తుందో,దాన్ని మాత్రమే స్వామిని అందరూ యాచించాలి.*
*"మోక్షసాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ" అని శంకరుల సిధ్ధాన్తం. మోక్షసాధన సామగ్రిలో భక్తి శ్రేష్ఠమైనది కాబట్టి ఆ భక్తితో పరమాత్మని సేవించి,బ్రహ్మైక్యాన్ని పొందాలి.*

*శ్లోకం*

*అశనం గరళం ఫణీ కలాపో*

*వసనం చర్మ చ వాహనం మహోక్షః*

*మమ దాస్యసి కిం కిమస్తి శంభో!*

*తవ పాదాంబుజభక్తిమేవ దేహి II*
              *-- శివానందలహరీ*
                  *(ఆదిశంకరులు)*

            *ఓమ్ నమశ్శివాయ


No comments:

Post a Comment