03/11/17, 4:30:07 PM: +91 94411 78068: బాదంపప్పు - భిక్ష
మేము
తంజావూరులో ఉన్నప్పుడు ఒకరోజు తెల్లవారుఝామున పరమాచార్య స్వామివారు నా
కలలో కనపడ్డారు. వారు నన్ను “నాకు బాదంపప్పు తేగలవా?” అని అడిగారు.
వెంటనే
మేము బాదంపప్పు కొని కాంచీపురం దగ్గర్లోని ఒరిక్కై అనే పల్లెటూరికి
వెళ్ళాము. అప్పుడే పరమాచార్య స్వామివారు అన్నభిక్ష మాని కేవలం పేలాలు
మాత్రమే తినడం మొదలుపెట్టారు. మేము తెచ్చిన బాదంపప్పు మహాస్వామి వారి
భిక్షకు ఉపయోగించాలంటే ఎవరికి ఇవ్వాలో మాకు అర్థం కాలేదు.
ఒకావిడ
మమ్మల్ని ఉగ్రాణం గోపాలయ్యర్ గారి వద్దకు తీసుకుని వెళ్ళింది. అప్పుడు
అతను ఆత్రుతతో ఏదో వెతుకుతూ కనిపించాడు. మమ్మల్ని చూడగానే “ఇప్పుడు నన్ను
మాట్లాడించకండి. పెరియవ భిక్షకు సమయం అయ్యింది” అని చెప్పాడు.
మేము అతనితో, “ఏమిటి మీరు వెతుకుతున్నారు? మేమైనా కొనితేగలమా?” అని అడిగాము.
అతను
బాధతో, “ఇప్పుడు బాదంపప్పు ఎక్కడ దొరుకుతుంది. ఒక్కరాత్రిలో మొత్తం
ఉన్నదంతా చీమలు తిన్నాయి. ఈ విషయం మేనేజరుకు తెలిస్తే నామీద కోప్పడతారు.
మీరు కాంచీపురం వెళ్తేనే అవి దొరుకుతాయి. కాని అప్పటికి స్వామివారి భిక్ష
పూర్తి అయ్యుంటుంది” అని చెప్పారు. మా ఆనందానికి అవధులు లేవు. మేము కొని
తెచ్చిన బాదంపప్పు అతనికి ఇచ్చాము. వాటిని చూడగానే గోపాలయ్యర్ ఊపిరి
పీల్చుకున్నాడు.
పరమాచార్య
స్వామివారికి సంబంధించిన విషయాలు ఎవరి ప్రమేయము లేకుండా సాఫీగా
సాగిపోతాయి. మావల్లే అవి జరిగితున్నాయి అనుకోవడం మన అతిశయం మాత్రమే. వారు
ఆడించే ఆటలో మనం కేవలం పావులం మాత్రమే.
--- జయలక్ష్మి అమ్మాళ్, పొల్లాచి. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 4
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment