24/09/17, 10:53:25 AM: +91 98660 49721: దశరా నవరాత్రులలో *నాల్గవరోజు కూష్మాండ* అవతారవిశేషలు
4) కూష్మాండ
సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ
దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||
దుర్గామాత
నాల్గవ స్వరూపం కూష్మాండాదేవి. దరహాసం చేస్తూ బ్రహ్మాండాన్ని అవలీలగా
సృష్టిస్తుంది. కాబట్టి ఈమెకు ఆ పేరు వచ్చింది. ఈమె సర్వమండలాంతర్వర్తిని.
రవి మండలంలో నివశించే శక్తి సామర్థ్యాలు ఈ తల్లికే ఉన్నాయి. ఈమె ఎనిమిది
భుజాలతో ఉంటుంది. తన ఏడు చేతుల్లోనూ కమండలం, ధనుస్సు, బాణం, కమలం,
అమృతకలశం, చక్రం, గద ధరిస్తుంది. ఎనిమిదవ చేతిలో సర్వసిద్ధులనూ, నిధులనూ
ప్రసాదించే జపమాలను ధరిస్తుంది. ఈమె సింహవాహనం అధిష్టిస్తుంది. సంస్కృతంలో
కూష్మాండం అంటే గుమ్మడికాయ. ఈమెకు గుమ్మడికాయ అంటే ఎంతో ఇష్టం. అందుకే
ఈమెకు గుమ్మిడికాయను బలిగా సమర్పిస్తారు. ఈ దేవిని ఉపాసిస్తే సాధకుని మనసు
అనాహతచక్రంలో స్థిరంగా ఉంటుంది. ఉపాసకులకు ఆయురారో గ్యాలను
ప్రసాదించటమేగాక, వారి కష్టాలను కూడా పోగొడుతుంది. మనపురాణాలలో తెలిపిన
విధంగా దుర్గామాతను మనం భక్తితో పూజించి ఒక అడుగు ముందుకు వేసినచో....
మనలను రక్షించుటకు ఆమె ముందుకు వచ్చును.సహృదయముతో ఈమెను శరణు వేడిన పరమపదము
అతి సులభముగా లభించును.
నాలుగవరోజు నైవేద్యం ----- చిల్లులేని అల్లం గారెలు....... ప్రసాదములు ఎలా చెయ్యాలో రాసి ఉన్నది.
(చిల్లులు లేని) అల్లం గారెలు
కావలసిన పదార్థాలు:--
మినప్పప్పు -- 1/2 కేజీ
అల్లం -- 100 గ్రాములు
పచ్చిమిర్చి -- 50 గ్రాములు
జీలకర్ర -- 2 స్పూన్స్
కొత్తిమీర & కరివేపాకు -- కొంచెంగా
నూనె -- 1/2 కేజీ
ఉప్పు -- తగినంత
తయారీవిధానం:--
గారెలు
చేసే 2 గంటల ముందుగా మినప్పప్పుని నానబెట్టాలి. నానిన తరవాత నీళ్ళు
తక్కువగా పోసి, గారెలపిండిలాగ గట్టిగా రుబ్బుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి
ముద్దలాగా చేసుకొని కలుపుకోవాలి. జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి
బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె పోసి
గారెలపిండిని తీసుకొని చిల్లులు లేకుండా వడలులాగా వేసుకోవాలి. దోరగా
వేయించి తీసుకోవాలి. అంతే వేడివేడి కమ్మని అల్లం గారెలు రెడీ.
No comments:
Post a Comment