28/10/17, 7:33:29 PM: +91 94411 78068: శివ పదం - జీవన పథం
నేను
విజయవాడలో ఉద్యోగం చేస్తున్నటువంటి రోజుల్లో 1993వ సంవత్సరంలో ఎందుకో
చెన్నై నగరం రావాలి అని కోరిక పుట్టి, రావడం జరిగింది. అక్కడకు వచ్చిన నాకు
ఎందుకో కాంచీపురం వచ్చి స్వామివారిని చూడాలని అనిపించింది. అంతకు కొద్ది
కాలం నుంచే స్వామివారి దివ్యమైన లీలలు, మహిమలు విజయవాడ నగరంలో కొందరు
మిత్రుల ద్వారా తెలుసుకున్న తరువాత వారిని ఎలాగైనా దర్శించాలనే కోరిక
అప్పుడు నెరవేరింది. నేను వచ్చాను అని నేను భావించడంలేదు జన్మాంతరంలో ఏం
సుకృతముందో వారు ఇక్కడకు రప్పించారు అని ఇక్కడకు వచ్చిన తరువాత తెలిసింది.
అలా
వచ్చినప్పుడు, నాకు ఇప్పటికి గుర్తు ఆ ప్రాంతంలో శ్రీవారు కూర్చుని
ఉన్నారు, మౌనంలో ఉన్నారు. అది మధ్యాహ్న సమయం. షుమారు అక్టోబరు ఆ మాసంలో.
భక్తుల వరుస ఎక్కువగా ఉన్నది అక్కడ చివరి వరకు కూడా. ఆ వరుసలో నేను కూడా
నిలబడి, ముందుకు వస్తూ ఉంటే, అప్పుడు నేను చేతివ్రాతలో ఉన్న “శివపదం”
కీర్తనలు మొత్తం పట్టుకుని ఉన్నాను. సరిగ్గా ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి,
వరుసలో నుండే కొంతదూరం నుండి శ్రీవారి దర్శనమవుతున్నది.
మహాతేజోమయమైన
ఆ మూర్తిని చూస్తూ ఉంటే నాకు అనిపించింది ఇంతమందిలో నన్ను ప్రత్యేకంగా
నన్ను చూశారు అని స్పష్టమైన, గాఢమైన అనుభూతి కలిగింది. ఇప్పటికి
మర్చిపోలేను అది. నన్నే చూస్తున్నారు నాపై ఆయనకు అఖండమైన వాత్సల్యమున్నది.
అది ఎప్పట్నించో నన్ను వాత్సల్యంతో గమనిస్తున్న చూపే ఇప్పుడు నేను
ప్రత్యేక్షంగా చూస్తున్నాను అనే అనుభవం కలిగింది. అప్పుడు కేవలం ఆ చేత్తో
గ్రంథం పట్టుకోగానే నానోట ఆప్రయత్నంగా వెలువడినటువంటి శ్లోకం,
మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ |
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ||
ఇదే
అప్రయత్నంగా వెలువడుతూంటే చిత్రం ఆ హడావిడిలో ప్రతివారు దర్శనం చేసి
వెళ్ళిపోవడమే జరుగుతోంది అక్కడ. ఆయన సమీపంలో ఉన్నటువంటి ఒక మహాత్ములేవరో
లోపలనుండి వచ్చారు. వచ్చి మీ చేతిలో ఉన్న పుస్తకాన్ని స్వామివారు
అడుగుతున్నారు అన్నారు. నేను ఆశ్చర్యపోయి చేతివ్రాతలో ఉన్న గ్రంథాన్ని ఆయన
చేతిలో పెట్టాను. అక్కడ శ్రీవారి సమీపానికి వెళితే దాన్ని తాకి, వారు
దానిమీద చేతితో కుంకుమని, పటికబెల్లాన్ని వేసి తిరిగి నాకు పంపించారు.
ఆ
“శివపదం” ముందు వారి చేతి స్పర్శ చేత ధన్యమైంది. అటు తరువాత కేవలం
ఆధ్యాత్మికతని మొదలైన వాటిని నా వ్యక్తిగత సాధన కోసం ఉపయోగించుకుంటూ
మిగిలిన జీవన వ్యవహారాలు మిగిలిన వాటిలో ఉందామని భావించిన నాకు, అటుతరువాత
నా జీవితమంతా భగవత్ సాధనగా ఆ క్షణం నుంచే మారడం జరిగింది. కనుక ఈ జీవితం
ఆయన చేతి స్పర్శతో మలచబడి సాగుతున్నదని భావిస్తూ ఎక్కడున్నా ఎలా ఉన్నా
నన్ను శ్రీవారు నడిపిస్తున్నది, వారు నన్ను గమనిస్తున్నారను స్పృహ ఆనాటి
నుంచి కలుగుతున్నది.
ఆ
తరువాత ఆశ్చర్యకరంగా నేను చెన్నై నగరం రావడం, వచ్చిన తరువాత గురువుగారి
చరణాలకి మరింత సన్నిధియై ఒక్కొక్కప్పుడు ఆ చరణాల్లో “నిమజ్జన్మ జీవః కరణ
చరణైహి శత్చరణతాం” అన్నట్లుగా ఆ చరణాల్లో లినమైపోతున్నామా అన్నంత అనుభూతి
నాకు కలిగించడానికి చంద్రశేఖర యతీంద్ర స్వామివారి విషయంలో నాకు గురు
స్వరూపమైనటువంటి వారు చల్లా విశ్వనాథ శాస్త్రిగారు.
నాకు
స్పష్టంగా తెలిసినది, తరువాత అనేకమంది మహాపండితులు, పెద్దలు వీరందరి
ద్వారా నేను గ్రహించింది ఏమిటంటే పరమాచార్యుల విషయంలో పరమ ప్రామాణికంగా
ఏదైనా ఒక మహా విషయాన్ని తెలియజేయాలంటే దానికి సర్వ సమర్థులు విశ్వనాథ
శాస్త్రిగారని మాకు స్వానుభవంతో తెలుసు.
--- బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment