Sunday, November 26, 2017

23/09/17, 9:49:01 PM: Sivananda Nirmala: శరన్నవరాత్రి శుభాకాంక్షలతో..


నవదుర్గలు :

ప్రధమంశైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి

తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్ధామ్||

పంచమం స్కంధమాతేతి షష్ఠమం కాత్యాయనీ తిచ

సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం

నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||


1 శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి): దుర్గాశరన్నవరాత్రుల్లోపాడ్యమి నాడు ప్రారంభమయ్యే మొదటి అవతారంశైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగాబాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దువాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడేతనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారంహిమవంతునికి పుత్రికగా జన్మిం చింది. ఆమె వాహనంఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లోచురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి. ఈ రోజుఅమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధికలుగుతుంది.

శ్లో|| వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతశేఖరాం| వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||



2. బ్రహ్మచారిణి ( గాయత్రి )  : దుర్గామాత రెండవఅవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికినారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతనుఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.

శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ | దేవీప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||



3. చంద్రఘంట ( అన్నపూర్ణ )  : అమ్మవారి మూడవఅవతారం చంద్రఘంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు అర్ధాకృతలో ఉండటంవల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లినిశరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూఉంటుంది.

శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా| ప్రసాదంతనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||


4. కూష్మాండ ( కామాక్షి ): అమ్మవారి నాలుగవ అవతారం కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ ఈమెతేజోమయి. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్లఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.

శ్లో|| సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ| దధానాహస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||



5. స్కందమాత ( లలిత ): అయిదో అవతారంస్కందమాత స్కంధుడు అనగా కుమార స్వామి. స్కందునితల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగాశ్వేతపద్మంతో శోభిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకుపతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందునటానికి సంకేతమేఇది.

శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||



6. కాత్యాయని (లక్ష్మి): దుర్గామాత ఆరో అవతారం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తనకు పార్వతీమాతకుమర్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికికూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరువచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణుమహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవినిసృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షిపూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమితిథుల్లో పూజలందుకుని విజయదశమినాడుమహిషాసురుణ్ని వధిస్తుంది.

శ్లో||చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా | కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||



7. కాళరాత్రి ( సరస్వతి ): దుర్గామాత ఏడో అవతారంకాళరాత్రి. ఈమె శరీరం ఛాయ చీకటివలె నల్లగాఉంటుంది. ఇందుకే ఈదేవికి కాళరాత్రి అని పేరు. ఈమెవాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలనుఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడాపిలుస్తారు.

శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా| లంబోష్ఠీకర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |

వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా| వరమూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ||


8. మహాగౌరి ( దుర్గ ) : అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికికఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహంనల్లబడుతుంది. ఆమె తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్నిగంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దాని వలన ఆమె శరీరంగౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.

శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||


9. సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి ): దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్నిసిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులనుఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలుచెబుతున్నాయి.

శ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి| సేవ్యమానాసదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

శరన్నవరాత్రి శుభాకాంక్షలతో

No comments:

Post a Comment