18/11/17, 3:35:19 PM: +91 94407 61176: 🌸🌸🌸🌸🌸అభినందనలు 🌸🌸🌸🌸
ఈ
కార్తీకమాస పర్వదినాలలో కవా డి గూడ శంకరా రాధ్య మఠం లో "గణార్చనలు "
ఘనంగా నిర్వహించిన అందరినీ అభినందిస్తూ అపరమేశ్వరుడి కృపావీక్షణ ములు మీపై
ప్రసారించాలని ఆశిస్తూ అందించే ఈ అభినందనలు అందుకోండి .......మీ
ముత్యంపేట గౌరీశంక ర శర్మ .
అష్టావధాని. పండిత మండలి సభ్యుడు .శైవమహా పీఠం .
భాగ్యనగరం.
18/11/17, 3:35:57 PM: +91 94407 61176: సీ:శ్రీ శంకరారాధ్య శైవ పీఠము నందు
కార్తీక మాసాన ఘనముగాను
మాహేశ్వరార్చనల్ మనముందు మంత్రముల్
గాణామృతమ్ముతో గంతు లేయ
ప్రతిమాస శివరాత్రి ప్రఖ్యాత దీ క్షతో
రుద్రహోమమ్ములు భద్రముగను
కైలాసమున శివుడు కళ్యాణవేలలో
ఆనందతాండవమ్మాడునట్లు
గీ:ప్రణవ రుద్రాభిషేకముల్ పావన ముగ
లింగధారణ క్రతువును సాంగముగను
భవ్య శైవాగమోక్త ప్రభాసురముగ
విధిగ జరిపించుకున్నట్టి విజ్ఞులార!
శైవ ఆరాధ్య వర్య విశిష్టులార !వందనమ్ములు మీకభి నందనలును ..
18/11/17, 3:35:58 PM: +91 94407 61176: సీ:రంగు రంగులు గల్గు రంగవల్లులతోడ
దీపాలు వెలిగించు దీ ప్తులార!
ప్రతిరోజు పూజకై ప్రాదోష కాలాన
సిద్ధము జేయు ప్రసిద్దులార!
మంగళహారతుల్ మది నిండ వెలుగొంద
గానమ్మొనర్చు విజ్ఞానులార!
భోజనమ్మున గాని భాజనమ్మున గాని ప్రాతినిధ్యమొ నర్చు ప్రబలులార!
గీ:"జంటనగర శాఖ"పంటలు పండగా
ప్రేరణమ్ము జేయు ధీరులార!
ఈ "కవాడి గూడ "యిలలోన కైలాస
మనగ జేసినట్టి మాన్యులార!
18/11/17, 3:36:14 PM: +91 94407 61176: గీ:కార్య కర్తలార! సహకార ఘనులార!
ఈ"గణార్చనమ్ము" ఇంత ఘనము
జేయు కారణమ్ము ధ్యేయమే మీరలు
మిమ్ము కారుణతోడ మిక్కిలి ప్రేమతో
అది దంపతులు ను ఆ ఆంజనేయుడు
ఆయువిచ్చి బ్రోచుయనవరతము !!
No comments:
Post a Comment