21/11/17, 3:17:53 PM: MVMRAO: కైలాసవాసి. నిరంతర
అధ్యాత్మికామానస శివభక్తి పరా యణులు.రాష్ట్రీయ స్వ యం సేవా సంఘ
కార్యకర్త.శివశ్రీ తాడి గొండ లింగమూర్తి గారికి ..
********అక్షర నివాళి ********
శ్రీ శైవ పీఠాన సేవలెన్నియో జేసీ
ఆరాధ్య వర్యుడై యలరువాడు
శ్రీవిద్య పీఠానచిన్మయ కళలతో
స్మితదరహాసుడై సిరులుపంచె
రాష్ట్రీయ సేవలో రాటుదేలిన కర్త
క్రమశిక్షణా యుతుడు. కార్యశీలి.
ఆధ్యాత్మికమమైన ఆచారమందైన
నియమాలతో మెలగు నిర్మలుండు.
గీ: మంచివక్తయు. రచయిత. మాన్యుడైన
ఉత్తమా ధ్యాపకుడు గుణ సత్తముండు.
"తాడికొండ"సువంశాఖ్య ధర్మవిదు డు.
లింగమూర్తి యు కపటము లేని వాడు .
స్థి త ప్రజ్ఞుడు అతని కి నటులొ నర్తు !!
అశ్రునయనాల తో ......
శైవ పీఠం తరపున. ఆత్యాగమూర్తికి. సభక్తి పూర్వకముగా. సాంజలి బద్ధముగా ..సప్రశ్రయముగా...సమర్పణమ్ !!!🙏🙏🙏
.......ముత్యంపేట గౌరీశంక ర శర్మ....
No comments:
Post a Comment