Sunday, November 26, 2017

21/11/17, 3:17:55 PM: MVMRAO: సీ:శ్రీ శంకరారాధ్య శైవ పీఠము నందు
కార్తీక మాసాన ఘనముగాను
మాహేశ్వరార్చనల్ మనముందు మంత్రముల్
గాణామృతమ్ముతో గంతు లేయ
ప్రతిమాస శివరాత్రి ప్రఖ్యాత దీ క్షతో
రుద్రహోమమ్ములు భద్రముగను 
కైలాసమున శివుడు కళ్యాణవేలలో
ఆనందతాండవమ్మాడునట్లు
గీ:ప్రణవ రుద్రాభిషేకముల్ పావన ముగ
లింగధారణ క్రతువును సాంగముగను
భవ్య శైవాగమోక్త ప్రభాసురముగ
విధిగ జరిపించుకున్నట్టి విజ్ఞులార!
శైవ ఆరాధ్య వర్య విశిష్టులార !వందనమ్ములు మీకభి నందనలును ..

No comments:

Post a Comment