20/11/17, 11:13:23 AM: TATA SUDHARANI: ఓం త్రయంబకం యజామహే
సుగంథిం పుష్టివర్థనం ఊర్వారుకమివ బంథనాత్ మ్రృత్యోమ్రృక్తిక్ఝయ మామ్రతాత్.
🌹🌷💐🌸🌺🌻
పుట్టిన ప్రతీ మనిషిని తాను
చనిపొతానేమోనని అనే భయం వెంటాడుతూనే ఉంటుంది .ఈ భయాన్ని ఎవరు పోగొడతారు ? ఎలా తొలగించుకోవాలి ?మృతువును జయించిన
మృత్యుంజయుడే ఇందుకు దిక్కు .కాలుడిని భస్మం చేసిన కాలకాలుడే .మార్కండేయునివంటి భక్తులను
మృత్యువునుంచి కాపాడిన భక్తవత్త్సలుడు ,
ఆశుతోషుడు
అయిన మహేశ్వరుడే మృత్యువునుంచి మృత్యుభయంనుంచి రక్షిస్తాడు .మోక్షాన్ని
ప్రసాదించే ఆపవర్గప్రదుడు కూడా సదాశివుడే .రుద్రుణ్ణి
మంత్రాలతో అర్చించినా, ధ్యానించినా లేదా
ఆయన నామాలను పలికినా చాలు .మరణ భయం తొలగుతుంది .ముక్తి లభిస్తుంది .అందుకే రుద్రపాఠం చివర మృత్యుంజయ మహా మంత్రాన్ని విధిగా ఇలా
చదువుతారు .
ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోరుముక్త్షియా మామృతాత్ .
(దివ్య
సుగంధంతో అలరారుతూ ,సర్వజీవులను పుష్టిగా పోషించే ముక్కంటి అయిన పరమశివుని
మేము ఆరాధిస్తున్నాము .దోస తీగ లేదా తొడిమ నుంచి దోసపండు విడినట్లుగా
,సంసార బంధనాలనే మృత్యువునుండి మమ్ము ఆ పాశవిమోచకుడు విడుదలచేయుగాక !
మేము అమృతత్వం నుంచి మాత్రం విడివడకుండుగాక !)
పుష్టిగా
పోషించడమంటే వ్యవహారికంగానే గాక పరమార్థికంగా అధ్యాత్మిక వృద్ది
పొందించమనేది ప్రార్థన .ముగ్గిన దోసపండును తీగె లేదా తొడిమ నిశ్శబ్దంగా
వదిలేస్తుంది .అయినా ఆ పండు అక్కడే భూమిపై ఉంటుంది .అలాగే చావు -పుట్టుకల
సంసారం లేదా మృత్యువు అనే తీగనుంచి
మానవుడు శివానుగ్రహంతో విడుదల అయితే అదే ముక్తి హేతువు .అకాల మరణం
కలగకూడదని ,సంసారంలో మళ్లీ పడతోయని మృత్యువే కావాలని అర్థిస్తున్నాం .
ఈ కార్తీకంలో ఆ శివుని అనుగ్రహం కలగాలని
ప్రార్థిద్దాం .🙏🙏🙏☘☘☘
No comments:
Post a Comment