Tuesday, November 14, 2017

11/11/17, 7:29:39 AM: Mouli: *కార్తీకపురాణం 23వ అధ్యాయము*

*పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున  ముక్తినొందు సందర్భం*

💥అగస్త్యుడు మరల
అత్రి మహర్షి ని గాంచి" ఓ మునిపుంగవా!
విజయమొందిన పురంజయుడు యేమిచేసెనోవివరింపుమని అడుగ గా అత్రిమహాముని యిట్లుచెప్పిరి.

💥ఓ కుంభ సంభవా!
పురంజయుడు కార్తీక వ్రతాచరణప్రభావము వలన అసమాన బలో పేతుడై అగ్ని శేషము, శత్రుశేషము వుండ కూడదని తెలిసి, తన
శత్రు రాజుల నందరినీఓడించి నిరాటంకముగా తన రాజ్యమును యేలుచుండెను తన యొక్క విష్ణు భక్తి ప్రభావమువలన గొప్ప పరాక్రమవంతుడు,
పవిత్రుడు, సత్య దీక్షా తత్పరుడు, నిత్యాన్నదాత, భక్తి ప్రియవాది, తేజో వంతుడు, వేద
వేదాంగ వేత్తయై యుండెను.
మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తనకీర్తిని
ప్రసరింప చేసెను.

💥శత్రువులకు సింహ
స్వప్నమై, విష్ణుసేవా ధురంధరుడై, కార్తీకవ్రత ప్రభావమున కోటికి పడగెగెత్తి అరి షడ్వర్గ ములనుకుడా జయించిన వాడైయుండెను. ఇన్ని ఏల? అతడిప్పుడు విష్ణుభక్తా గ్రేసరుడు సదాచార సత్పురుషులలో వుత్తముడై
రాణించుచుండెను.
అయినను అతనికి తృప్తిలేదు. ఏ దేశమున, ఏకాలమున, ఏక్షేత్రమున ఏవిధముగా శ్రీహరి ని పూజించిన కృతార్దుడనగుదునా? యని విచారించుచుండగా

💥ఒకానొక నాడు
అశరీర వాణి, పురంజయా! కావేరీ
తీరమున శ్రీరంగ
క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని
పిలిచెదరు. నీ వచటకేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపుము. నీవీ
సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందెదవు" అని పలికెను.

అంతటా పురంజయుడు ఆ
అశరీరవాణి వాక్యములు విని, రాజ్యభారమును మంత్రులకు అప్పగించి, సపరివారముగా బయలుదేరి మార్గమద్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయాదేవతలను సేవించుచు, పుణ్యనదులలో స్నాన ము చేయుచు, శ్రీరంగ మును జేరుకొనెను.
అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగ నాథాలయమున శేషశయ్యపై పవళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశ మొంది, చేతులు జోడించి,
*దామోద రా! గోవిందాగోపాలా! హరే! కృష్ణా! వాసుదేవా!అనంతా! అచ్యుతా!ముకుందా! పురాణపురుషా! హృషికేశా! ద్రౌపదీ మానసంరక్షకా! దీ న జన భక్తపొషకా ! ప్రహ్లాదవరదా! గరుడధ్వజా ! కరివరదా! పాహిమాం! పాహమాం! రక్ష మాం రక్షమాం! దాసోహం పర మాత్మ దాసోహం*

యని విష్ణు సోత్త్రమును పఠించి, కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివార ముగా అయోధ్యకు
బయలుదేరెను.

💥పురంజయుడు
శ్రీరంగనాథస్వామి
సమక్షమున కార్తీక
మాసములో చేసిన
వ్రతముల, మహిమ వలన అతనిరాజ్య మందలి జనులంద రూ సిరిసంపదలతో , పాడిపంటలతో, ధన ధాన్యాలతో, ఆయురారోగ్యములతో నుండిరి.
అయోధ్యా నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్ర ద్వార ములు కలిగి
మనోహర గృహగోపురాదులచే
చతురంగ సైన్య
సంయుతమై ప్రకాశించుచుండెను.
అయోధ్యా నగరమందలి వీరులు యుద్దనేర్పరులై, రాజనీతి గలవారై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై యుండిరి. ఆ నగర మందలి
అంగనా మణులు హంస గజగామినులూ, పద్మపత్రాయతలోచ నులూ, విశాల కటిత్వము, సూక్ష్మ మద్యత్వము;
సింహ కుచపినత్వము
కలిగి రూపవంతులనియు, శీలవంతులనియు,గుణవంతులనియు ఖ్యాతికలిగి యుండిరి.

💥ఆ నగర మందలి
వెలయాండ్రు నృత్య
గీత సంగీతాది కళావిశారదులై, ప్రౌఢు లై, వయోగుణ రూప లావణ్య సంపన్నులై, సదామోహన సాలంకృత ముఖశోభితులై యుండిరి.

💥ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూషా పరాయణలై సద్గుణాలంకార భూషితులై
చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరలై యుండిరి.

💥పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై యింటికి
సుఖిముగా జేరేను.
పురంజయుని రాకవిని పౌరజనాదులు మంగళ వాయిద్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంత:పురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభి లాషియై దైవ భక్తి పరాయుణుడై
రాజ్యపాలనమొనర్చుచు, కొంత కాలము
గడిపి వృద్దాప్యము
వచ్చుటచే ఐహిక
వాంఛలను వదులుకొని, తనకుమారునికి
రాజ్యభారము అప్పగించి పట్టాభిషీక్తుణ్ణి చేసితను వానప్రస్థాశ్రమ మందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీకవ్రత మాచరించుచూ సమగ్రమముగా
శరీరముడుగుటచే
మరణించి వైకుంఠమునుకు పోయెను.

💥కావున, ఓ
అగస్త్యా! కార్తీకవ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది.

💥 దానిని ప్రతివారు, ఆచరించవలను. ఈ కథ చదివిన వారికి, చదివినపుడు వినువారికికూడా వైకుంఠ ప్రాప్తి కలుగును.

త్రయోవింశోద్యాయము సమాప్తము.

లోకాసమస్తా శుఖినోభవంతు💐

No comments:

Post a Comment