Tuesday, June 11, 2019

🕉️అర్ధనారీశ్వరం🕉️
By Yes P K


వాసుదేవనల్లూరు  ఒక
అందమైన చిన్న ఊరు. తమిళనాడు , తిరునల్వేలి జిల్లాలోని పుళియంకుడికి సమీపంలోవుంది. ఈవూరు
నెల్లై ప్రాంత  ధాన్యపు గిడ్డంగిగా పేరుపొందింది.  ప్రకృతి అందాలతో పాటు ప్రాచీన పౌరాణిక చరిత్ర
యీ ఊరి ఖ్యాతి ని మరింత  పెంచాయి.

స్త్రీ వేరు , పురుషుడు వేరు
కాదు . సృష్టిలో ఇద్దరూ సమానమే
అని నిరూపించేs మూర్తియే అర్ధనారీశ్వరమూర్తి. అటువంటి అపురూపమైన ఆదిదంపతులు అర్ధనారీశ్వరుని రూపంగా యీ వూరిన వెలసారు.

సాధారణంగా శివాలయాలన్నింటిలో
శివుని కి పార్వతి కి ప్రత్యేక సన్నిధులు వుంటాయి.   కానీ , యీ ఆలయంలో
శివ పార్వతులు అర్ధనారీశ్వర మూర్తిగా దర్శనమివ్వడం అపూర్వం.

కైలాసవాసులైన శివ పార్వతుల నిత్య దర్శనమే భాగ్యమే భాగ్యమని ఋషిపుంగవులంతా
కైలాసం లోనే నివసించాలని తపిస్తారు.
కానీ , భృంగి ముని మాత్రం
ఈశ్వరుడొక్కడే తన దైవమని, అన్యులతో పనిలేదని పార్వతీదేవిని
అలక్ష్యపరిచాడు. తాను ఒక తు మ్మెదగా మారి అమ్మవారికి పరమేశ్వరునికి మధ్య చేరి  శివుడిని మాత్రం పూజించాvడు.
ఇది చూసిన పార్వతి దేవి
మనిద్దరం ఒకే శక్తి కదా ?
వేరు  వేరు కాదు కదా అని ఈశ్వరుని ప్రశ్నించింది.

 ఈ పరమార్ధాన్ని భృంగి మునికి తెలియజేయాలని  , మహేశ్వరుడు పార్వతీ దేవిని తన అర్ధ భాగం గా చేసుకుని  దర్శనమిచ్చాడు .

"దేవీ ,నీవు వేరు నేను వేరని  భావించేవారికి
నీవు నేనూ ఒకటే నన్నది,
యీ సమయంలోనే
తెలియ చేద్దాంl.
నీవు భూలోకానికి వెళ్లు.
గతంలో , మన కళ్యాణోత్సవాన్ని పొదిగమలై నుండే  వీక్షించిన అగస్త్య మహర్షి వంటి అనేక  ఋషులు,యోగులు ,
జ్ఞానులు, భక్తులు నివసిస్తున్న  సిందవనంలో తపమాచరించమని
శివుడు పార్వతీ దేవిని
ఆదేశించాడు.

ఆ విధంగా పార్వతీదేవి
వాసవనూరు అనే యీ
స్ధలానికి వచ్చి, మంచినీటి
నూతిని, నందనవనాన్ని
ఏర్పాటు చేసుకుని,
ఒక చింత చెట్టు  నీడలో
శివలింగాన్ని , ప్రతిష్టించి
 మంచి నీటితో అభిషేకించి, సువాసన కలిగిన పుష్పాలతో ఈశ్వరుని భక్తి శ్రధ్ధలతో పూజించింది.
చింతచెట్టు క్రింద ప్రతిష్టింప బడి పూజించినందున
యీ ఈశ్వరునికి చింతామణి
నాదర్  అనే పేరు వచ్చింది.

అమ్మ వారి పూజలకు మెచ్చిన  శివుడు ప్రత్యక్ష మై పార్వతీదేవిని
వరము కోరుకోమన్నాడు.

" స్వామి, శివ పార్వతులమైన మనము  వేరు వేరుగా కాకుండా ఏకమూర్తిగా నే వుండాలి" అని కోరుకొన్నది పార్వతీదేవి.
ఈశ్వరుడు పార్వతీదేవి కోరిక చెల్లించేవిధంగా , ఆమెను  తన వామ భాగమున
చేర్చుకుని అర్ధనారీశ్వర మూర్తి గా వెలిశాడు.
 దేవేంద్రుడు  తన పరివారంతో వచ్చి ఈ స్ధలంలోని
అర్ధనారీశ్వరుని పూజించి తరించాడు.

రవివర్మ అనే చేరదేశ రాజు యొక్క పుత్రుడైన కులశేఖర్ కు కుష్టు వ్యాధి రాగా, ఎవరూ వ్యాధి నివారణ చేయలేక పోయారు. ఆ సమయంలో
రాజుగారి దర్శనానికి ఒక
శివ యోగి వచ్చాడు.

రాజు తన పుత్రుని వ్యాధి విముక్తుని చేయమని ఆయోగిని వేడుకున్నాడుs.
 ఆ యోగి, రాజు కుమారుడిని చూసి , యీ స్ధలంలో వున్న  పవిత్ర పుష్కరిణిలో స్నానం చేసి ఒడలంతా విభూతి పూసుకుని , యిక్కడి నిక్షేప నదీతీరాన కూర్చుని
ఈశ్వరనామాన్ని భక్తితో  జపింపజేయమని చెప్పాడు.

యోగి ఉపదేశానుసారం
కులశేఖరుడు కుంభ పుష్కరిణి లో స్నానం చేసి శివయోగి చెప్పినట్టుv శివుని ధ్యానించి  తన వ్యాధి నుండి విముక్తుడైనాడు.

 ఆ తర్వాత ఈశ్వరునికి  మరింత పెద్ద ఆలయం
నిర్మించాడు.  కాలక్రమేణా ఆలయం  చుట్టూ ఊరు పెరిగింది.

పుణ్యనదిగా  పురాణంలో పేర్కొనబడిన
నిక్షేప నదీ తీరాన
యీ ఆలయం వున్నది.
ఈ  అర్ధనారీశ్వరుని ఆలయ వెలుపలి ప్రహారీ గోడలు కోట బురుజుల్లా వుంటాయిl.
ఆలయ ముఖ ద్వారం వద్ద ఎత్తైన స్ధంభాలు.
స్ధంభాల వెనుక ప్రాకారంలో ధర్మశాస్తా ఆలయం వున్నది.

ఆగమశాస్త్ర ప్రకారం
నిర్మింప బడిన యీ ఆలయ ముఖ మండపం
కళ్యాణ మండపం అని
పిలవబడుతోంది. అందమైన వేదిక తో ఉయ్యాల మండపం,
నటరాజ స్వామి  సన్నిధి
వున్న మండప ప్రధాన ద్వారం కుడి ప్రక్కన వినాయకుని సన్నిధి వున్నsది.

వెలుపలి ప్రాకారాన్ని చుట్టి, దక్షిణ ప్రాకారానికి
వస్తే,  అక్కడ ఆలయ స్ధల వృక్షమైన చింత చెట్టును
దర్శిస్తాము.

గర్భగుడి వెలుపల ఒక మండపం వున్నది.  ఇక్కడే
సుందరమైన అర్ధనారీశ్వరుని శిలా విగ్రహం  అందరిని ఆకర్షిస్తూ బహు సుందరంగా దర్శనమిస్తుందిv. ఈ ప్రాంగణంలో చేరమాన్, భృంగి మహర్షి, రవి వర్మ,చంద్రశేరుల
విగ్రహాలను చూడగలము.
మూలస్ధాన పై కప్పు
చందన కలపతో నిర్మించబడింది.

ఈ ఆలయంలో  జ్యేష్ట మాసంలో  ఉత్సవాలు వైభవంగా చేస్తారు.l
ధ్వజారోహణం తరువాత
పది రోజులపాటు  ఉత్సవాలు
జరుపుతారు. మూడవ
రోజున పరమేశ్వరుడు  భృంగి మహర్షి కి ప్రత్యక్షమైన ఉత్సవం గా జరుపుతారు.

No comments:

Post a Comment