ఆరాధ్య బంధువులకు శరణులు.......
షట్కాల శివపూజా దురంధరులు, నిత్యాన్నదాన పరాయణులు,, శైవ మతోధ్ధారకులు, శతాధిక గ్రంథకర్త రచయిత, సంస్కృతాంధ్ర పండితులు, వేలాదిమందికి శాంభవ దీక్ష నొసగిన అపర బసవేశ్వరులు, శైవ మహాఫీఠ అధ్యక్షులు,,మనందరికీ ప్రాతః స్మరణీయులు, అయిన శంకరారాధ్య స్వామి వారిచే రచింపబడిన'' భావ లింగ '' శతకము మనందరి కోసము, మరియు భావి తరాలవారికి ఉపయుక్తంగా ఉంటుందనే ఆలోచనతో........'' భావలింగ శతకము'' లోని పద్యాలు రోజుకు కొన్ని చొప్పున మీకు అందించాలనే ఆలోచన.....నా యీ చిన్న ప్రయత్నాన్బి ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ........
18) ఆ.వె
ఆస దగిలి జనులు హరుని దలచంగ
అతడు దూరమయ్యె నాస వల్ల,
ఆస దెగిన వెనుక హరునితో పనియేమి,
పాప భయ విభంగ భావలింగ
19)ఆ.వె
నేనటన్న వారు నిలువక వెళ్ళిరి
నీవటన్న వారు నిలిచి చనిరి,
ఏమి యనని వారలెప్పటి కుండిరి
పాప భయ విభంగ భావలింగ
20)ఆ.వె
తిట్టగానె తిట్టు తివిరి దుర్మార్గుండు,
తిట్లు బడియు సైచు ధీర జనుడు
తిట్ట గానె నవ్వు దేవతా వంద్యడు,
పాప భయ విభంగ భావలింగ
21) ఆ.వె.
కటిక వాని కైన కాల్ మ్రొక్కవచ్చు,ను,
సోమయాజి ముఖము జూడరాదు,
పారుడైన వాడి పశువుల జంపునా
పాప భయ విభంగ భావలింగ.
22)ఆ.వె
మాట నిల్పెనేని కోటి యేండ్లుండును,
మాట నిల్పడేని మరణ మొందు
మాట నిల్ప లేక మరణ మొందుట
పాపభయ విభంగ భావలింగ
23) ఆ.వె.
నేను నీవటన్న కానౌదు నని యన్న,
మాట జాడగాంటి మనము లోన
నింక నెవడు పలుకు నీమాట నీ కన్న
పాప భయ విభంగ భావలింగ
24) ఆ.వె
పాము వణకుచుండు పక్షీంద్రు గతి జూచి,
గజము వణకు సింహ గతిని జూచి
వేద మట్లె వణకు వేదాంతి గతి జూచి,
పాప భయ విభంగ భావలింగ
25)ఆ.వె.
ముక్కు చక్కి గనక ముష్టికి లోబడి
మొరుగి చుంద్రు పెక్క మోహకముల
ముక్కు జూడ నేర్చి ముక్కంటి గా లేక,

No comments:
Post a Comment