Tuesday, June 4, 2019

సంన్యాసులు ఆరు రకాలు :By Sivananda Nirmala

1. కుటీచకుడు : శిఖ , యజ్ఞోపవీతము, దండ- కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తి మార్గంలో పయనిస్తూ  అల్పాహారం తీసుకుంటూ ఉంటారు .

2 .బహూదకుడు : ఇతను రోజుకు ఎనిమిది కబళములు ఆహారం తీసుకుంటూ, నిత్యం సాధన చేస్తూ ఉంటారు.

3. హంస : ఇతను జడధారియై కౌపీనం ధరించి, జ్ఞానియై ఉంటాడు.

4 .పరమహంస : వెదురు దండాన్ని కలిగి , ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని కౌపీనం మాత్రం ధరించి ,
 నిరంతర సాధన లో ఉంటారు .

5.తురియాతీతుడు : దేహాన్ని ఓ శవంలా చూస్తాడు .

6.అవధూత :

ఇతనికి ఏవిధమైన నిష్ఠ నియమాలు లేవు .జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం అంటూ ,
నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు, చూసే వాడికి కనిపించే ఈ రూపం నాది కాదు .
నాకు పాప పుణ్యాలు , సుఖ దుఖాలు లేవు , గర్వము మాత్సర్యము , దంభము , దర్పము , ద్వేషము ,
అన్నింటిని త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి
అగ్ని దేవుడికి కాస్త దొరికిన ఆహారం అర్పణ చేస్తూ ,
దొరకని రోజు ఏకాదశి , దొరికిన రోజు ద్వాదశి అంటూ....
రాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు .
కర్మలు అన్ని క్షయం అయిపోయి, వరించిన మోక్షం అనే కంబళి కప్పుకుని ఉంటాడు ... ( నిర్వాణ షట్కానికి ప్రతి రూపం - అవధూతల మరో రూపం )


ఆత్మసాత్కాక్షారం నుండి ..........

No comments:

Post a Comment