ఆరాధ్య బంధువులకు శరణులు
By Ravishankar mudigonda
ముదిగొండ శంకరారాధ్య స్వామి వారిచే రచింపబడిన'' ' భావలింగ శతకము'' లోని కొన్ని పద్యాలు మీ కోసం....
26) ఆ.వె
పాము వణకుచుండు పక్షీంద్రు గతి జూచి,
గజము వణకు సింహ గతిని జూచి
వేదమట్లె మణకు వేదాంతి గతి జూచి,
పాప భయ విభంగ భావలింగ
27)ఆ.వె
ముక్క చక్కి గనక ముష్టికి లోబడి
మొరుగుచుంద్రు పెక్కు మోహకముల
ముక్కు జూడనేర్చి ముక్కంటి గాలేక
పాప భయ విభంగ భావలింగ
28) ఆ.వె.
చిలిపిదనము చేత సిధ్ది కోసము బోయి
కుంభకాలు సేయు గుహలు దూర
నేల, కోర్కెలుడుగ గాలి కుంభించద
పాప భయ విభంగ భావలింగ
29)ఆ.వె
ఆత్మ నెరుగు నట్టి యజ్ఞాన జనముల
కర్మ వలన సురలు గండ్రు సిరుల
బ్రహ్మ విష్ణు సురల బ్రతుకు లీలాటివి
పాప భయ విభంగ భావలింగ
30)ఆ.వె
మ్రొక్కి మ్రొక్కి నొసలు మోరుండ గట్టెను
దిక్కు లేక బోయె దేవు డెవడు
మ్రొక్కు నొసటి లోనె మురిసితి నినుజూచి
పాప భయ విభంగ భావలింగ
రేపు మరికొన్ని పద్య రత్నాలు మీ కోసం..
( సశేషం )
By Ravishankar mudigonda
ముదిగొండ శంకరారాధ్య స్వామి వారిచే రచింపబడిన'' ' భావలింగ శతకము'' లోని కొన్ని పద్యాలు మీ కోసం....
26) ఆ.వె
పాము వణకుచుండు పక్షీంద్రు గతి జూచి,
గజము వణకు సింహ గతిని జూచి
వేదమట్లె మణకు వేదాంతి గతి జూచి,
పాప భయ విభంగ భావలింగ
27)ఆ.వె
ముక్క చక్కి గనక ముష్టికి లోబడి
మొరుగుచుంద్రు పెక్కు మోహకముల
ముక్కు జూడనేర్చి ముక్కంటి గాలేక
పాప భయ విభంగ భావలింగ
28) ఆ.వె.
చిలిపిదనము చేత సిధ్ది కోసము బోయి
కుంభకాలు సేయు గుహలు దూర
నేల, కోర్కెలుడుగ గాలి కుంభించద
పాప భయ విభంగ భావలింగ
29)ఆ.వె
ఆత్మ నెరుగు నట్టి యజ్ఞాన జనముల
కర్మ వలన సురలు గండ్రు సిరుల
బ్రహ్మ విష్ణు సురల బ్రతుకు లీలాటివి
పాప భయ విభంగ భావలింగ
30)ఆ.వె
మ్రొక్కి మ్రొక్కి నొసలు మోరుండ గట్టెను
దిక్కు లేక బోయె దేవు డెవడు
మ్రొక్కు నొసటి లోనె మురిసితి నినుజూచి
పాప భయ విభంగ భావలింగ
రేపు మరికొన్ని పద్య రత్నాలు మీ కోసం..
( సశేషం )
No comments:
Post a Comment