ఆరాధ్య బంధువులకు శరణులు.......Ravishankar Mudigonda
షట్కాల శివపూజా దురంధరులు, నిత్యాన్నదాన పరాయణులు,, శైవ మతోధ్ధారకులు, శతాధిక గ్రంథకర్త రచయిత, సంస్కృతాంధ్ర పండితులు, వేలాదిమందికి శాంభవ దీక్ష నొసగిన అపర బసవేశ్వరులు, శైవ మహాఫీఠ అధ్యక్షులు,,మనందరికీ ప్రాతః స్మరణీయులు, అయిన శంకరారాధ్య స్వామి వారిచే రచింపబడిన'' భావ లింగ '' శతకము మనందరి కోసము, మరియు భావి తరాలవారికి ఉపయుక్తంగా ఉంటుందనే ఆలోచనతో........'' భావలింగ శతకము'' లోని పద్యాలు రోజుకో రెండు చొప్పున మీకు అందించాలనే ఆలోచన.....నా యీ చిన్న ప్రయత్నాన్బి ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ........
1) ఆ.వె..
మ్రొక్కులిడుదు సర్వమునకు సర్వాత్మకు,
శంకరునకు నతని కింకరులకు
నీదు పాదములకు నిత్యంబు మ్రొక్కెద,
పాప భయ విభంగ భావలింగ.
2) ఆ.వె.
నిన్ను దెలియఁగాన నీమీద పద్యముల్,
చెప్ప బూనినాను చిత్తగించు,
నిన్ను గన్న వెనుక, మిన్న కుండుటె సాక్షి,
పాప భయ విభంగ భావలింగ

No comments:
Post a Comment