Wednesday, June 26, 2019

49. సర్వరుణా  by Mallikharjun

ఇది నాలుగు అక్షరాల నామం . ఈ నామంతో అమ్మవారికి నమస్కరించునపుడు "సర్వరుణాయై నమః " అని చెప్పాలి .

సర్వ + అరుణ  = సర్వారుణా  = సర్వము అరుణ వర్ణముగా భాసించునది .

అమ్మవారి పాదపద్మాల నుండి వెలువడే కిరణ పుంజములనే ప్రపంచము అంతా నిండి ఉంటుంది . ఆమె శరీరఛాయ -  ఎఱుపు ,ధరించే ఆభరణాలు - ఎఱుపు , దంతాల చిగుళ్లు - ఎఱుపు , కట్టిన వస్త్రం - ఎఱుపు , పెదవులు - ఎఱుపు , ఇలా సర్వం అరుణామయం
( సరస్వతి దేవి అయితే  సర్వం శుక్లా వర్ణం ). ఆమె సాన్నిధ్య ప్రకాశం సహస్ర సూర్యోదయాల సమన్వయము . ఆమె హిరణ్యవర్ణ . సర్వము అరుణమవడం వలన ఆమె "సర్వారుణా ". ఇలా ఉండటం ఆమె నిష్పక్షపాత అనురాగ ప్రభకు నిదర్శనం . అరుణవర్ణం చైతన్యాన్ని , అనురాగాన్ని , జ్ఞానోదయాన్ని సూచిస్తుంది . అమ్మవారు ఈ లక్షణాలు వున్నది కాబట్టి  "సర్వారుణా ".

సర్వము అరుణవర్ణముగా భాసించునది , చైతన్యా రాశి , అనురాగపు ముద్ద - అని ఈ నామానికి అర్థాలు గా చెప్పుకోవచ్చు .

ఓం శ్రీ మాత్రే నమః...

(శక్తి ఆరాధన శ్రీచక్ర ఉపాసన)

No comments:

Post a Comment