*శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –47*
🕉🌞🌎🌙🌟🚩
*గంధ సింధూర విశేషం*
.శ్రీరామ పాద సేవా దురంధరుడు , రామభక్తి సామ్రాజ్యాధి పతి అయిన
శ్రీ హనుమంతుడు అయోధ్య లో శ్రీరామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరిపించాడు
రామప్రభువు సీతామాతను ప్రేమించి నంతగా తనను ప్రేమించటం లేదని తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావించాడు .
రాత్రి వేళల్లో తనను అసలు రాముని వద్ద ఉండనివ్వటం లేదు.
తనను ఎందుకు ఉపేక్ష చేస్తున్నాడో అర్ధంకావటం లేదు. తన కంటే సీతామాతలో అధికంగా ఏముంది ?ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గరే ఉచుకోవటానికి కారణ మేమిటో, ఆ ఆజన్మ బ్రహ్మ చారికి ఏమీ తెలియక తల్లడిల్లుతున్నాడు .జానకీ దేవి పాపిడిలో యెర్రని సిందూరపు బొట్టు కనిపిస్తోంది. ఆ యెర్ర బొట్టుకు రాముడు ఆకర్షితు డయాడేమోనని అనుమానం వచ్చింది.
ఆ సిoధూరమే తన కొంప ముంచి శ్రీరాముడిని సీతా దేవికి అతి సమీపంగా ఉంచుతోందని భ్రమపడ్డాడు .
శ్రీరామ విరహాన్ని ఒక క్షణం కూడా సహించలేని దుర్భర వేదనకు గురి అయాడు .దీని సంగతేమిటో తేల్చుకోవాలని శ్రీ రాముడి దగ్గరకే ,వెళ్లి చేతులు జోడించి ”రామయ తండ్రీ !మా తల్లి సీతా మాత శిరస్సు మీద ఉన్న పాపిటలో సింధూరం ఉంది .దానికి కారణం ఏమిటో వివరించండి ”అని ప్రార్ధించాడు .
శ్రీ రామ ప్రభువు చిరునవ్వు నవ్వి ,భక్త హనుమాన్ను సమీపానికి రమ్మని, ”భక్తా ఆంజనేయా ! సీతదేవి నుదుట సింధూర బొట్టు పెట్టుకోవటానికి
కారణం ఉంది .
శివ ధనుర్భంగం చేసి ,జానకిని వివాహ మాడిన శుభ సమయంలో ఆమె పాపిట మీద సిoధూరాన్ని నేను ఉంచాను .అప్పటి నుండి ఆమె సిoధూరాన్ని, పాపిటలో ధరిస్తోంది. దాని వల్ల, నేను
సీతకు వశుడను అయ్యాను.
మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సిoధూరమే కారణం ”అని వివరించి చెప్పాడు .
ఆంజనేయుడు శ్రీ రాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు .ఇక ఆలస్యం చెయ్య లేదు. వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్లి, గంధ సిన్దూరాన్ని తీసుకొని, నువ్వుల నూనె తో కలిపి, తన ఒళ్లంతా పూసేసు కొన్నాడు. ఇలా చేస్తే ఆ సింధూరం ప్రభావం వల్ల, తన రాముడు, మళ్ళీ తనవశం అవుతాడని భావించాడు.
వెంటనే హుటాహుటిన
శ్రీరామ దర్శనం చేసి నమస్కరించి, ”ప్రభూ!
సీతారామా !చిటికెడు
సిoధూరానికే సీతా మాతకు వశమై పోయావు.
మరి ఇప్పుడు నేను ఒళ్లంతా సింధూరం పూసుకొన్నాను.
మరి నాకు మీరు ఎప్పుడూ వశులై ఉంటారు కదా ?”అని అమాయకంగా అయినా, మనసు లోని మాటను, ధైర్యం గానే చెప్పాడు .సీతా రాముడు నవ్వి ఆనందంతో ‘హనుమా !ఈ రోజు మంగళ వారం. నాకు ప్రీతీ కలిగించాలని, శరీరం అంతా సిoధూరాన్ని ధరించావు కనుక, నీకు మంగళవారం, భక్తీ తో గంధ సింధూరంతో పూజ చేసి, దాన్ని నుదుట ధరించిన భక్తులకు, అన్ని శుభాలను నీవు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరం గా గ్రహించు .” అని హనుమకు మనశ్శాంతిని చేకూర్చాడు.
అప్పటి నుండి శ్రీహనుమంతునికి,
మంగళవారం నాడు, గంధ సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి, నుదుట బొట్టుపెట్టుకొనే ఆచారం, లోకంలో
ప్రారంభమైంది. ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపినా లేపనాన్ని, శరీరం అంతా పూసి ఉంచటం మొదలైంది. అభిషేకం చేసిన తర్వాత, ఈ లేపనాన్ని పూస్తారు. సిందూర పూజ హనుమకు, అత్యంత ప్రీతి కరం. అందులోను మంగళ వారం రోజున మరీ ఇష్టం. ఇదీ సింధూరం కధా విశేషం.
సింధూరం గురించి ఇంకో కధ కూడా ప్రచారంలో ఉంది.
ఇది ఆంజనేయుని తొమ్మిది అవతారాలలో మొదటిది విజయుని చరిత్రకు సంబంధించినది. ఆ విజయుడే పాండవ మధ్యముడయిన,
అర్జునుడు. ధర్మ రాజు చేసిన రాజసూయ యాగంలో దక్షిణ దేశాలను జయించటానికి, అర్జునుడు సైన్యంతో బయల్దేరాడు. దక్షిణ సముద్రాన్ని చేరి, అక్కడ శ్రీ రాముడు లంకకు కట్టిన వారధిని చూసి, పరిహాసంగా నవ్వాడు. అక్కడే ఉన్న హనుమకు కోపం వచ్చింది. ఇద్దరికీ వాగ్వాదం పెరిగింది. ప్రతిజ్ఞలు చేసుకొన్నారు. పంతాలకు పోయి. అప్పుడు శ్రీ కృష్ణుడు, అక్కడికి వచ్చాడు.
కిరీటి బాణాలతో, సేతువును నిర్మించాడు. దాని కింద, ఎవ్వరికీ తెలీకుండా, కృష్ణుడు, తాబేలు రూపంలో ఉండి, సేతువు విరిగి పోకుండా, కాపాడుతున్నాడు. హనుమ ఒక్కసారి సేతువు పైకెక్కి, కాళ్ళతో చిందర వందర చేస్తూ తొక్కుతున్నాడు. సేతువు యే మాత్రం వంగకుండా శిధిలం కాకుండా నిలబడి ఉంది. హనుమ అంతటి బలాధ్యుని పాద ఘట్టనానికి తట్టుకొని నిల బడింది. ఆంజనేయుడు ఓటమిని అంగీకరించాడు.
అర్జునుడు విజయగర్వంతో విర్రవీగాడు.కృష్ణుడు నీటి నుండి బయటకు వచ్చాడు.
ఒళ్లంతా రక్తం కారుతోంది.
పార్ధునితో సహా, అందరు భయపడ్డారు. అప్పుడు పరమాత్మ, ”అర్జునా ! ఈ జయం నీది కాదు .
ఆoజనేయుడిది. నేను వారధి కింద వీపు పెట్టి మోయకపోతే అది హనుమ ఒక్క లంఘనానికే, విరిగి ముక్కలయ్యేది .నీ పరువు కాపాడటానికి నెత్తురువోడే టట్లు, శ్రమించాను. బాధ భరించాను. హనుమకు నేను రాముడిగా, కృష్ణుడిగాo ఉంటున్నానని తెలియదు పాపం..”అన్నాడు. అర్జునుడు సిగ్గుపడి తన తప్పుకు పశ్చాత్తాపపడి హనుమను ఆశ్రయించాడు.
హనుమ
శ్రీకృష్ణుని, శ్రీ రామునిగా గ్రహించి, ఆయన వీపుకు అంటిన రక్తాన్ని అంతటిని, తన శరీరానికి పట్టించు కొన్నాడు.
క్షమాపణ కోరాడు .అప్పటి నుండి, ఆంజనేయునికి, సింధూర పూజ వ్యాప్తిలో ఉందని తెలుస్తోంది. అర్జునుని రధం మీద, జెండాపై హనుమ ఉండి, మహా భారతయుద్ధంలో ఆతని విజయానికి కారకుడ వుతానని అనుగ్రహించాడు.
దాన్నే ”కపి ధ్వజం ”అంటారు.
By MVMRAO

No comments:
Post a Comment