By Subrahmanyam. Mసాహితీ సరస్వతీ హిత కరముగ/
ప్రధమ భావ రచన ప్రక్రియనగ /
వేద వాజ్ఞ్మయంబు వెలసినదీచోట/
శివపురీశ దేవ చిద్విలాస/🙏
ఉపనిషత్తులొచ్చె యుజ్వల సాహిత్య/
మునకు ప్రేరణొసగె ముందు తరము/
ఇనకుల చరిత తొలి ఇతిహాసమాయెను/
శివపురీశ దేవ చిద్విలాస/🙏
తల్లి సంస్కృతంబు తనయలౌ భాషల/
సాహితీ సుగంధ సౌరభములు/
పరిమళించె ప్రజలు పరవశమొందగ/
శివపురీశ దేవ చిద్విలాస/🙏
తెలుగు జాతి వెలుగు తెలియగ నిలిపిన/
భవ్య కవుల పటిమ బహు ముఖములు/
కావ్య యుగము గడచె కవనము కొనసాగె/
శివపురీశ దేవ చిద్విలాస/🙏
ప్రధమ భావ రచన ప్రక్రియనగ /
వేద వాజ్ఞ్మయంబు వెలసినదీచోట/
శివపురీశ దేవ చిద్విలాస/🙏
ఉపనిషత్తులొచ్చె యుజ్వల సాహిత్య/
మునకు ప్రేరణొసగె ముందు తరము/
ఇనకుల చరిత తొలి ఇతిహాసమాయెను/
శివపురీశ దేవ చిద్విలాస/🙏
తల్లి సంస్కృతంబు తనయలౌ భాషల/
సాహితీ సుగంధ సౌరభములు/
పరిమళించె ప్రజలు పరవశమొందగ/
శివపురీశ దేవ చిద్విలాస/🙏
తెలుగు జాతి వెలుగు తెలియగ నిలిపిన/
భవ్య కవుల పటిమ బహు ముఖములు/
కావ్య యుగము గడచె కవనము కొనసాగె/
శివపురీశ దేవ చిద్విలాస/🙏
No comments:
Post a Comment