Wednesday, June 26, 2019

ఆరాధ్య బంధువులకు శరణులు.......by Ravishankar Mudigonda


షట్కాల శివపూజా దురంధరులు, నిత్యాన్నదాన పరాయణులు,, శైవ మతోధ్ధారకులు,  శతాధిక గ్రంథకర్త రచయిత, సంస్కృతాంధ్ర పండితులు, వేలాదిమందికి శాంభవ దీక్ష నొసగిన అపర బసవేశ్వరులు, శైవ మహాఫీఠ అధ్యక్షులు,,మనందరికీ ప్రాతః  స్మరణీయులు, అయిన శంకరారాధ్య స్వామి వారిచే రచింపబడిన'' భావ లింగ  '' శతకము మనందరి కోసము, మరియు భావి తరాలవారికి ఉపయుక్తంగా ఉంటుందనే ఆలోచనతో........'' భావలింగ శతకము''  లోని పద్యాలు రోజుకు కొన్ని చొప్పున మీకు అందించాలనే ఆలోచన.....నా యీ  చిన్న ప్రయత్నాన్బి ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ........


13) ఆ.వె
 తానటంచు బోయి తహతహ బడి, నీల్గు
నీవటంచు బోయి నెరి సుఖించు,
నిన్ను నమ్మువాడు నిందల బొందునా,
పాప భయ విభంగ భావలింగ..



14) ఆ,వె.
 మన్ను బొమ్మ జేసి, మాటలు నేర్పిన,
వాని మహిమ గనక వ్యర్ధులగుచు,
తమరి మహిమ జూప తపసులైన నేమి,
పాప భయ విభంగ భావలింగ


15వెర్రి కుక్కల వలె వేదాంతి మూకలు,
కూసుతారు పొట్ట కూటి కొరకు,
తోలుబొమ్మ నెరుగు దొడ్డ విద్యేటికో
పాప భయ విభంగ భావలింగ



16)ఆ.వె,
 తప్ప గూసుకొనుచు తహతహ పడ నేల,
తనలొ వేరె యొకడు దాగు నెట్టు,
లేమి యనక నుంటె యీ బాధ లుండునా,
పాప భయ విభంగ భావలింగ..


17)ఆ.వె.
 చెట్లు నీళ్లు దాగ చెరువుకు బోలేదు,
నీళ్లు లేక నవియు నిలిచె నెట్లు
ఆవిధంబు జూచి యనంద మొందితి,
పాప భయ విభంగ భావలింగ

No comments:

Post a Comment