Wednesday, June 5, 2019

*శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –46*
🕉🌞🌎🌙🌟🚩

*కుoభినీ పాలుని కధ*

శ్రీరామ చంద్రుని పరిపాలనా కాలంలో దక్షిణ భాగంలో
ధర్మారన్యం, అంటే ఈ నాటి కర్నాటకలో, రాక్షసుల చేత ధ్వంసం చెయ్యబడ్డ గ్రామా లను, రాముడు పునర్నిర్మించి, వాస యోగ్యం చేయించాడు .ఆ గ్రామాలకు, ”మండల నగరం" అనే దాన్ని, ప్రధాన కేంద్రంగా చేశాడు .అక్కడ వేద వేద్యులు, సత్కర్మా చారణులు, పండితులు, జ్ఞాన నిష్టులు, అనేక మంది ఉండేవారు. దానికి ధర్మకర్తగా, ఆంజనేయుడిని, నియమించాడు. శ్రీ రాముని తరఫున, హనుమ, వారిని చక్కగా కాపాడుతున్నాడు.


 ప్రజలకందరికి మంచి రక్షణ కల్పించాడు. కలి ప్రవేశించే వరకు అక్కడ ఎలాంటి ఉపద్రవాలు లేవు. గొప్ప ధర్మ వ్యవస్థనేర్పరచి. దాని దిన దినాభి వృద్ధికి కృషి చేశాడు.
కలికాలం ప్రవేశించగానే, దాని పరి పాలనాన్ని అక్కడి వారికే వదిలి, గంధ మాదన పర్వతం చేరి శ్రీ రామునిపై ధ్యానం చేస్తూ, గడుపుతున్నాడు .
కలియుగంలో ”కన్యా కుబ్జం" అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకొని, ”ఆ మందుడు ”అనే రాజు పాలిస్తున్నాడు .అతనికి ”మాయ”అనే భార్య ఉంది.
 వారికి ”రత్న గంగ ”అనే కూతురు జన్మించింది. ఆమెను అల్లారు ముద్దుగా పెంచుతూ, సర్వ విద్యా విశారదను చేశారు. ఆమెకు పెండ్లీడు వచ్చింది. వరాన్వేషణ చేస్తున్నారు.


వీరి పురోహితుడు ”ధర్మ సఖుడు ”.ఆయన రోజు పురాణ శ్రవణం చేస్తూ, రాజుకు చాలా సంతోషం కల్గిస్తున్నాడు.
 ఒకరోజు ఆయనతో, ”మహాత్మా !కలి ప్రవేశించింది.
 కల్మషం అంతటా వ్యాపించి పోయింది .”అన్నాడు. రాజు "కలి కల్మషమంటే ఏమిటి?"అని అడిగాడు. ఆయన దానికి, అర్ధం అసత్య ప్రచారం అని చెప్పి, ”కలి కాలంలో అబద్ధం చెప్పేవారు, వేదాన్ని దూషించే వారు, హింసను పెంచే వారు, ధర్మాన్ని వదిలేసి, అర్ధ, కామాలను మాత్రమే, ఆశ్ర యించేవారు, ఎక్కువైపోతారు.
 విశ్వాస హీనులు ,కామ పరాయణులు, దైవ చింతన లేనివారు, డాoబికులు ,వేష దారులు,పాషoడులు,
ప్రజావంచకులు, అసూయా పరులు, మూర్ఖులు పెరిగి పోతారు. వీటివల్ల, ఆ అధర్మాలన్ని, రాజుకు
సంక్రమిస్తాయి. మీరు ధర్మ పరులు కనుక, భారాన్ని దేవుడి మీద వేయండి.మన చిరంజీవికి   మంచి వరునితో త్వర లోనే వివాహం అవుతుంది ”అని చెప్పాడు. కొంత కాలానికి బ్రహ్మా వర్తాన్ని పాలించే, కుoభినీ పాలుడు అనే రాజుకు,
రత్నగంగ నిచ్చి, వివాహం చేశాడు. కుoభినీపాలుడు,
 భార్యతో కలిసి, ధర్మారణ్యానికి వెళ్లి, అక్కడ తన రాజ్యాన్ని స్థాపించాడు.
కుoభినీ పాలకుడు, క్రమంగా, వేద మార్గానికి దూరమై, జైన మతాన్ని అవలంబించాడు.
 అప్పటి దాకా బ్రాహ్మణులు, వేద విద్యా వ్యాప్తికి, సత్కర్మా చరణకు, యజ్న యాగాలకు, ఇవ్వబడిన అగ్రహారాలనన్నిటినీ,
 లాగేసుకొన్నాడు. జైనులను అక్కడ అధికారులనుగా
నియమించాడు.


 వాళ్ళు యజ్ఞ యాగాలు చేసే వారిని హింసించి, శిక్షించేవారు.
జైనుల వేధింపు విపరీతమై, వారికేమీ దిక్కు తోచలేదు.
 దుష్టులకు రాజబలం తోడైంది. ఇక భరించలేక, అందరు కలిసి, కన్యాకుబ్జరాజు అయిన, ”ఆమందుడు రాజు ”కు, తమ గోడు విన్నవించుకొన్నారు.
 తాము అతి ప్రాఛీన కాలం నుండి అక్కడ ఉంటున్నామని,
త్రేతాయుగంలో శ్రీ రాముడు ”మహోదరం ”తో పాటు, మరి కొన్ని అగ్రహారాలను, తమకు ఇచ్చాడని, తమ అల్లుడు కుoభినీపాలుడు దుర్మార్గంగా వాటిని లాగేసుకొని ,
హింసిస్తున్నాడని దేవతారాదన,
 యజ్ఞ యాగాదులను, నిషేధించాడని, పూర్వ జీవితం కొనసాగించటం దుర్భరంగా ఉందని, మళ్ళీ తమ దైవ కార్య నిర్వహణకు, తమ వృత్తులను కొనసాగించుకోవటానికి వెంటనే చర్య తీసుకోమని విన్నవించారు.
 రాజు వారంతా చెప్పింది సావధానంగా ఆలకించాడు. అల్లుడు కుంభీపాలుడికి కబురుచేసి లాక్కున్న భూములనన్నిటిని బ్రాహ్మణులకు ఇచ్చి వేయమని, వేదవిద్యకు ఆటంకం కలిగించవద్దని, హితవు చెప్పి, రాజ పత్రం ఇచ్చి, వారిని పంపాడు . వారందరూ, కుoభినీపాలుడికి, రాజపత్రం ఇచ్చారు. ఇది అల్లుడికి కోపం తెప్పించింది.
 మొండిగా, ”మీకు యే రాముడు భూముల్ని ఇచ్చాడో, ఆ రాముడినే  రమ్మనండి.


 ఆయనతో బాటు ”తోకాయన్ను" కూడా తీసుకొని రండి. అప్పుడు ఆయన చెప్పింది విని, తగినట్లు చేస్తా" అని భీష్మించాడు. పాపం కొంత మంది బ్రాహ్మణులు, రాజుకు ఎదురు తిరగలేక, జైన మతాన్ని తీసుకొని, రాజుకు లోబడి జీవిస్తున్నారు.మిగిలిన వారు, తమను రక్షించగలిగేది, వాయుసుతుడైన హనుమ ఒక్కడే నని గ్రహించి, శరణు కోరుతూ, ధ్యానించ సాగారు. భక్త సులభుడైన మారుతి, వెంటనే ప్రత్యక్షమై వారికి ఆనందం కల్గించాడు. వారు ఆయన్ను ప్రస్తుతి చేశారు.
 తమ బాధను
వెళ్ళబోసుకొన్నారు.
వారిని రక్షించాలనే ఉద్దేశ్యంతో మనసు కరిగి, తన ఎడమ బాహువు నుండి ఒక వెంట్రుకను, కుడిచేతినుండి ఇంకో రోమాన్నితీసి, ఒక భూర్జర పత్రంలో భద్రంగా ఉంచి, దాన్ని బ్రాహ్మణుల కిచ్చి, రాజు దగ్గరకు వెళ్లి, తమ భూములను ఇమ్మని అడగమని చెప్పి, పంపించాడు. ఇవ్వకుండా తిరస్కారం చూపిస్తే, ఒక రోమాన్ని, సింహ ద్వారం మీద ఉంచండి.
అప్పుడు భయంకరమైన అగ్ని జ్వాలలు ఏర్పడి, రాజసౌధాన్ని,పట్టణాన్ని,
 కాల్చేస్తాయి. మీ గ్రామాలను మీకిచ్చేసి, రక్షించమని, రాజు ప్రార్ధిస్తే, కుడి చేతి రోమాన్ని విసరండి.అప్పుడు అంతా యదాస్తితిలోకి వస్తుంది, అని చెప్పి పంపాడు. అక్కడ మూడు రోజులుoడమని ,
ఆకలి దప్పులతో బాధ పడుతున్నారు కనుక, తానిచ్చే ఫలాలను ఆరగించమని చెప్పి,
 అదృశ్య మైనాడు.


బ్రాహ్మణులు హనుమంతుని పూజ చేసి, ప్రసాదం తీసుకొని స్వస్థత చెందారు. మారుతి, వారికోసం, విశ్రాంతి గృహం నిర్మించాడు. మూడు రోజులు అందులో ఉండి, నాలుగవ రోజున వారి అగ్రహారాలకు, శిలాగ్రుం చేర్చింది . మర్నాడు వారంతా రాజు దగ్గరకు వెళ్లి, హనుమ చెప్పినట్లు అడిగారు. దానిని మన్నిoచకుండా, అవమానించాడు. హనుమ ఎడమ చేతి వెంట్రుకను ద్వారం మీద ఉంచారు. పట్టణం అంతా అంటుకొని భస్మీ భూతమైంది. . ఆర్త నాదాలు పట్నం అoతా, వ్యాపించాయి. జైనులందరూ పారిపోయారు.


బ్రాహ్మణుల ప్రభావాన్ని గమనించి, రాజు భయపడి వారి అగ్రహారాలను, వారికిచ్చివేశాడు .వారు కుడి చేతి రోమాన్ని విసరేశారు.
 దానితో పట్నం మామూలు అయింది. రాజు కూడా బుద్ధి తెచ్చుకొని, శ్రీరాముని భక్తుడు గా మారి, వేదానుసారంగా ప్రవర్తించాడు. ధర్మసంస్తాపకుడై ,
విష్ణుధ్యానరతుడై, ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు.
ధర్మారణ్యాన్ని నిజమైన
ధర్మారణ్యంగా పాలిoచాడు.
త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన హనుమను, అందరు భక్తీ శ్రద్ధలతో పూజిస్తూ, సుఖాలను పొంది, చివరకు కైవల్యం చేరారు.

🕉🌞🌎🌙🌟🚩 By MVMRAO 

No comments:

Post a Comment