Saturday, June 29, 2019

మోపిదేవియందు మోక్షప్రదాతవై/
గీసుకొండలోన కీర్తినొంద/
సర్ప రూపమందు సాక్షాత్కరించిన/
శివపురీశ దేవ చిద్విలాస/🙏

క్రిష్ణాజిల్లా మోపిదేవి మరియు వరంగల్లుజిల్లా గీసుకొండ గ్రామములయందు వేంచేసియున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారు మహిమాన్వితులు.  పిల్లలకు పుట్టువెంట్రుకలు తీయుట, చెవులు కుట్టించుట, ఆడపిల్లలకు సర్పదోషముల నివృత్తికి పూజలు, సంతానభాగ్యంకొఱకు పూజలు స్వామివారి ఈ సన్నిధులలో అనూచానముగా జరుగుచున్నవి.   వారి స్మరణలోనిది ఈ పద్యము. By Subrahmanyam M

No comments:

Post a Comment