22/05/17,
10:44:55 AM: +91 98490 98554: *అలాగే మొదట భారతీయులు తప్ప ప్రపంచమంతా
సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతాడని నమ్మింది, కానీ కాసేపు మనకూ, వాళ్ళు
చెప్పేవరకు తెలియదనుకుందాం. ప్రపంచమంతా భూకేంద్రక సిద్ధాంతం (Geo-centric
theory) నమ్మిందని సూర్యుడు నిజంగా భూమి చుట్టు తిరిగాడా? తర్వాత అది
తప్పని తెలుసుకున్నాక, భూమి తిరగడం మొదలుపెట్టిందా? సూర్యుడి చుట్టూ భూమి,
నక్షత్రాలు విశ్వారంభం నుంచి తిరుగుతూనే ఉన్నాయి. విశ్వమంతా సూర్యుడిలో
కలిసి అంతమయ్యేవారకు తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అది యొక్క ప్రకృతి ధర్మం,
తత్వం, యధార్ధం కూడా. వేదం కూడా అటువంటిదే. ప్రాకృతిక సత్యాలు, నియమాల
జ్ఞానమే వేదం. వేదం ఋషులకు తెలియబడకముందు ఉంది, మానవజాతి మర్చిపోయినా
ఉంటుంది. ఒకవేళ ప్రళయం వచ్చి మొత్తం సృష్టి అంతమైనా వేదం నిలిచి ఉంటుంది,
మళ్ళీ పునఃసృష్టి కూడా వేదం ఆధారంగానే జరుగుతుంది. అంటే వేదం సృష్టికి కూడా
అతీతమైనది. దానికి దేశకాలాలతో సంబంధం లేదు. ప్రళయ సమయంలో అది పరమాత్మలో
ఉంటుంది. అందుకే వేదం సనాతమైనది అన్నారు భారతీయులు.*
No comments:
Post a Comment