30/05/17, 8:46:45 AM: +91 80088 84529: ధర్మాకృతి : మణికుట్టి - 1
‘మణికుట్టి’
అన్న పేరు వినడంతోనే తల్లిదండ్రులు తమ పిల్లవాణ్ణి ముద్దుగా పిలిచే పేరుగా
తోస్తుంది. “కాకిపిల్ల కాకికి ముద్దు” అన్న సామెతగా, తమ గర్భవాసాన జనించిన
పుత్రులు ఎంత వికృతంగా ఉన్నప్పటికీ తల్లిదండ్రులకు వారెంతో సుందరంగా,
ప్రియంగా తోచడం లోకసహజం కదా! ‘కన్న’ ‘మున్న’ అని ముద్దు చేయడమూ ఉంటుంది.
మణికుట్టి అనేది ముద్దు పేరే అయినా తల్లిదండ్రులు వాత్సల్యంతో పిలిచినది
కాదు. గ్రామం, సీమ, పండితలోకం ఆ పిల్లవానిని అపురూపంగా ‘మణికుట్టి’గా
పిలుచుకున్నారు. అయితే కన్నతండ్రి మాత్రం తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి
వెళ్ళగొట్టారు. పిల్లవాడు పితృవాక్య పరిపాలనకు మించినది వేరే మంత్రం
లేదనుకొని, తిట్లనే పరమోపదేశంగా తీసుకొని, బ్రతికినన్నాళ్ళు ఆ ఉపదేశాన్ని
ఆచరణలో ఉంచుకొని నేను ఈ రోజున వారి కథ మీకు ఉదాహరణ కోసం చెప్పేంత ఉన్నతిని
సాధించారు.
వారెవరని తెలుసుకోవాలంటే వారి ముత్తాతల నుండి ఆరంభించాలి.
అది
17శతాబ్దపు చివరి దశాబ్దం. ఆ రోజుల్లో తంజావూరిలో మహారాష్ట్ర వంశమునకు
చెందినా షహాజీ మాహారాజా రాజ్యం చేస్తున్నారు. సకల కళావల్లభుడైన వారికి ఒక
కోరిక జనించింది. ఏమంటే...
ఈ
రోజుల్లో రిపబ్లిక్ దినాలు నడుపుకొంటున్నప్పుడు, సార్వభౌముని హోదాలో ఉన్న
రాష్ట్రపతి ఎదుట, అన్ని రాష్త్రముల ప్రభుత్వములు, గ్రామీణ ప్రజలు వారి వారి
సంస్కృతీ సంప్రదాయములను, వేషభాషలను ప్రదర్శించుతున్నారు కదా! ఆ సంస్కృతి
సంప్రదాయములలో విశేషములను మనమెంతో మెచ్చుకొని భారతీయ సంస్కృతిలోని ఏక
సూత్రతను దర్శించి సంతోషిస్తున్నాము కదా! అదే మాదిరి వేదశాస్త్రములలో వివిధ
రంగములకు చెందిన మహా పండితుల నందరినీ ఒక ప్రదేశంలో చేర్చి, నివాసము, జీవన
భ్రుతి కలుగజేసి తరించ వలెననే ఉన్నతమయిన ఆలోచన కలిగింది.
రాజయినందువల్ల
ఆశ కార్యాచరణలోనికి తేవడానికి తగిన సమర్థత, వసతి ఉంటుంది కదా! గుజరాత్,
మహారాష్ట్ర, ఆంద్ర, కర్ణాటక, తమిళనాడు మొదలయిన రాజ్యాలనుండి ఉత్తమోత్తమమయిన
పండితుల కుటుంబాలను ప్రార్థించి, తంజావూరు సీమకు తీసుకొని వచ్చారు. వారి
ఆచారానుష్ఠానములకు అనువుగా ఉంటుందని, కావేరీ దక్షిణ తీరమున ఉన్న
‘తిరుసైనల్లూరు’ గ్రామములో వారినందరినీ విడిది చేయించారు. పలువురు
నాయనార్లు పాటలు పాడిన శివక్షేత్రం అది. శ్రీధరయ్య వారు అనే ఆంద్ర
బ్రాహ్మణుడు కార్తిక అమావాస్య నాడు తమ ఇంటి నూతి నుండి గంగను తెప్పించిన
ఊరు అదే. శ్రీధరయ్య వారు కూడా షహాజీ ప్రార్థనకు అంగీకరించి ఈ ఊరిలో
స్థిరబడినవారే. విడిది చేయించిన బ్రాహ్మణులందరకూ గృహారామ సౌకర్యములు
ఏర్పాటు చేసి ఊరినంతటినీ ‘బ్రహ్మదేయ’మని పిలువబడెడి సర్వ మాన్యముగా దత్తం
చేశారు షహాజీ మహారాజు.
ఆ
రకంగా వచ్చి తిరువిసైనల్లూరు చేరిన బ్రాహ్మణ కుటుంబాలలో శ్రీ వాంజియంనకు
చెందిన కన్నడ కుటుంబం ఒకటి. వారి పూర్వీకులు తంజావూరు రాజులకు పరంపరగా
మంత్రిగా ఉండేవారు. ఆ కుటుంబమునకు చెందినా వారొకరు బాల్యమునుండియే మహా
మేధావి. ఆశుకవి అయినారు. శ్రీ వాంజియంనకు చెందినవారు కాబట్టి ఆ ఊరి స్వామి
పేరయిన వాంజీశ్వరన్ గా తండ్రి ఈయనకు నామకరణం చేశారు. అయితే అనతికాలంలోనే
ఊరి జనం ఆ పేరు మరచి “కుట్టికవి” అని పిలువనారంభించినారు. (కుట్టి అంటే
తమిళంలో పసివాడని అర్థం) – చాలా చిన్న వయస్సులోనే మహారాజు ఎదుట ఆశువుగా
కవిత్వం చెప్పడమే ఈ పేరు రావడానికి కారణం. “కుట్టికవి”నే కథానాయకునిగా
చేసుకొని కథ చెప్పడానికి చాలినంత విషయం ఉన్నప్పటికీ ఆరంభించిన మణికుట్టి
కథకు పోదాం.
“మణికుట్టి”
“కుట్టికవి” అపర అవతారం అని చెప్పుకొనే వారు. సాధారణంగా కుటుంబంలో
తండ్రిపోతే కుమారుని కడుపున మళ్ళా పుడతాడని ఒక నమ్మిక ఉన్నది. అందువల్లనే
పిల్లవానికి తాత పేరు పెట్టే ఆచారము వచ్చింది. అలా పేరు పెట్టుకొనే వారు
కాబట్టి తమిళంలో మనువనికి ‘పేరన్’ అని వ్యవహార నామం వచ్చింది. మన మణికుట్టి
కుట్టికవికి మనవడు కాదు. మునిమనవడు. కుట్టికవి పుత్రుడు మాధవ శాస్త్రి,
మాధవ శాస్త్రి కుమారుడు నరసింహ శాస్త్రి. వీరెంతో మహా విద్వాంసులు. మన శ్రీ
మఠ ఆస్థాన విద్వాంసులుగా జీతములు పుచ్చుకోకుండానే కైంకర్యము చేశారు. ఆ
నరసింహ శాస్త్రి కుమారులు ఈ మణికుట్టి – ఇంత మహోన్నతమయిన పండిత కుటుంబానికి
చెందినవారని చెప్పడానికే ముత్తాత నుండి మొదలు పెట్టాను.
18వ
శతాబ్దపు ద్వితీయార్థమునకు చెందిన వారు మణికుట్టి. ముత్తాత పేరు అయిన
‘వాంజీశ్వరన్’ అని వీరికి నామకరణం చేయబడింది. చిరుత ప్రాయము నుండే వీరి
బుద్ధి కుశలత, శేముషీ వైభవము కూడా ముత్తాతగారిని గుర్తుకు తెప్పించేది.
అందుకు తోడు తరువాత వీరి గౌరవ నామం కూడా “మణికుట్టి” అయినది.
తిరువిసైనల్లూరు లోనే ఉన్న ఈశ్వర శాస్త్రి అనే వారి వద్ద వీరు
మీమాంసాశాస్త్రం అభ్యసించారు.
(సశేషం)
No comments:
Post a Comment