08/05/17, 12:11:12 PM: +91 85002 83017: ఎప్పుడై 'అహంకారం' తేఉండదో
ఒకసారి తమ గ్రామములోని దేవాలయ పునరుద్ధరణ నిమిత్తం ఆ గ్రామప్రజలు మహాస్వామి వారి దీవెనలు స్వీకరించేందుకు వచ్చారు.
వారిలో
రెండువర్గాలు ఉన్నాయి అని గ్రహించారు మహాస్వామి వారు. ఒక వర్గం వారు మరొక
వర్గం వారికన్నా ఉన్నతమైనవారని భావిస్తున్నారు. వారిలో ఐక్యత లేకపోతే
దేవాలయ పునరుద్ధరణ పనులు సాఫీగా జరగవని తలచి స్వామి వారు వాళ్ళందరిని
వెళ్లి భోజనము చేసి రమ్మని చెప్పారు. భోజనం చేసిన పిదప చర్చిద్దాం అని
వారిని పంపించారు.
భోజనం
ముగించి అందరూ మరలా పరమాచార్య స్వామివారి ముందు వచ్చి కూర్చున్నారు.
స్వామిస్వామి వారు ప్రేమతో భోజనములో ఏమేమి తిన్నారు అని అడిగారు. అందరూ
ఒక్కసారిగా "కుళంబు (తమిళంలో కూరగాయల సాంబారు) మరియు రసం, పాయసం మరియు కూర,
అప్పడం మరియు వొడియాలు మొదలైనవి" అని చెప్పారు.
అప్పుడు మహాస్వామి వారు చిరునవ్వుతో ఇలా అడిగారు " కుళంబు మరియు రసంకు తేడా ఏమిటి?"
“కుళంబులో కూరగాయలు ఉంటాయి, రసంలో కూరగాయలు ఉండవు” అని చెప్పారు.
కూరగాయలను
తమిళంలో ‘తాన్/దాన్’ అని అంటారు. తాన్ అంటే మరొక అర్ధం ‘అహం’ నేను అనే
భావన అని. పరమాచార్యుల వారు "ఓహ్! అలాగా" అని చమత్కరించారు. కుళంబులో
‘తాన్’ లేదా ‘అహంకారం’ లేకపోతే అది ‘రసం’ అంటే రసమయం అవుతుంది అది
బ్రహ్మానందము. అహం యొక్క అంతం ఆత్మానందం.
అలా
ఒక సామాన్య పదం 'తాన్' ప్రయోగించి ఆ గ్రామస్థులలో అహంకారం పోగొట్టారు.
వారిలో ఆత్మాభిమానం చిగురించేలా చేసారు. అహంకారం తమను విడదీసిందని దానివల్ల
వచ్చిన అనైక్యత చాలా ప్రమాదకరమైనది, ఘోరమైనది అని గ్రహించారు. అహంకారం,
నేను నాదనే భావనే ఎవరికి మంచిది కాదు.
పరమాచార్య
స్వామివారు ఆ గ్రామస్తులు తమ తప్పును తెలుసుకున్నారని గ్రహించారు. వారిని
ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి దేవాలయ పునరుద్ధరణ విజయవంతం అవుతుందని దీవించి
పంపారు.
ఆలయ పునరుద్ధరణ చాలా బాగా జరిగిందని ఇక చెప్పాల్సిన అవసరం లేదు.
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment