27/05/17, 8:37:34 AM: KK: * దుఃఖాలకు మూలమైన అరిషడ్వర్గాలు
1.కామము – ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండడము.
2.
క్రోధము – కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు
నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో
నిర్ణయాలు తీసుకోవడము.
3.
లోభము – కోరికతో తాను సంపాదించుకున్నది, పొందినది తనకే కావాలని పూచిక
పుల్ల కూడా అందులోనుండి ఇతరులకు చెందగూడదని దానములు, ధర్మకార్యములు
చేయకపోవడము.
4. మోహము –
తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము
కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడము.
5. మదము – తాను కోరిన కోరికలన్ని తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరియెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయక పోవడము.
6.
మాత్సర్యము – తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని తనకు దక్కనిది
ఇతరులకు దక్కకూడదని ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా
దక్కకూడదనే ఈర్ష్య కలిగి యుండడము.
ఈ
అరిషడ్వర్గాలు శరీరములో చేరి మంచితనాన్ని దొంగిలించి చెడు కర్మలను
కలిగించడానికి కారకులగుచున్నారు. అరిషడ్వర్గాలనే దొంగలనుండి జాగ్రత్త
వహించితే ముక్తికి మార్గము సులభమవుతుంది.
No comments:
Post a Comment