23/05/17, 5:28:09 AM: +91 98484 03424: *హనుమంతుని_జననం_బాల్యం*
పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను.
వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి.
అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను.
అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ,వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను.
జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు
ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను.
అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధం తో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను.
అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది.
చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది.
తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి, వాయుదేవుడు వీచటం మానివేశాడు.
అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.
ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుని మునులు శపించడం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయింది.
No comments:
Post a Comment