27/05/17, 9:15:05 AM: +91 79811 59026: *సంత్ తుకారాం సూక్తులు-భగవన్నామ సంస్మరణ*
1. నడిచినంత సేపు భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే, ప్రతి అడుగుకు త్యాగం చేసిన ఫలితం లభిస్తుంది. ఆ భక్తుని శరీరమే ఆలయమవుతుంది.
2. పనిచేసినంత సేపు భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే, అలౌకిక శాంతి పొందుతాడు ఆ భక్తుడు.
3. తింటున్నంత సేపు భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే, ఆ భక్తునికి ఉపవాసదీక్ష చేసిన ఫలితం కలుగుతుంది.
4. భగవన్నామ సంస్మరణ నిత్యం చేస్తూ ఉంటే, ఆ భక్తునికి సమస్త భూమండలాన్ని దానం చేస్తే వచ్చే ఫలితం కంటే ఎక్కువ ఫలితం లభిస్తుంది.
5.
భగవన్నామ స్మరణ వల్ల భక్తుడు తెలియనిది తెలుసుకుంటాడు;చూడలేనిది
చూడగలుగుతాడు; చెప్పలేనిది చెప్పగలుగుతాడు; పొందలేనిది పొందగలుగుతాడు.
6. భగవన్నామ సంస్మరణ వలన వచ్చే లాభము అగణితము.
No comments:
Post a Comment