20/05/17,
10:13:40 AM: +91 98490 98554: *కృతజ్ఞత-భూసూక్తం:--* ప్రాధమికంగా
ప్రాచీనకాలంలో మనిషి కృతజ్ఞతతో నిండి ఉండేవాడు.ఎందుకంటే అతను ఈ లోకంలోకి ఒక
ఒంటరి యాత్రీకుడిగా వచ్చాడు.ప్రకృతిలోని నీరూ గాలీ భూమీ ఆకాశమూ సూర్యుని
వెలుగూ అతన్ని రక్షిస్తున్నాయని అతనికి స్పృహ ఉండేది.వాటి ఆధారంతోనే తాను
బ్రతుకుతున్నాననీ మనుగడ సాగిస్తున్నాననీ అతను గ్రహించాడు.ఇందులో తన గొప్పా
అహమూ ఏమీ లేవన్న సత్యాన్ని అతను గ్రహించాడు.కనుక వాటికి కృతజ్ఞుడై
ఉండేవాడు.వాటిని ఆరాధనాభావంతో దర్శించేవాడు.
వేదకాలంలో
ఉద్భవించిన మంత్రాలూ సూక్తాలూ అతను పొందిన ఈ సత్యమైన భావనకూ అతని ఈ
అనుభవానికీ తద్వారా అతని హృదయంలో ఉప్పొంగిన కృతజ్ఞతకూ ప్రతిరూపాలే.
ఉదాహరణకు
వేదంలోని 'భూసూక్తం' విషయాన్ని చూద్దాం. భూమినుంచే మనకు అవసరమైన సమస్తమూ
వస్తున్నది.మనం తినే తిండిని భూమే మనకు ఇస్తున్నది.మనకు ఆధారంగా మన ఇళ్ళకు
ఆధారంగా భూమే మనలను మోస్తున్నది.మనం విసర్జించిన మలమూత్రాలను అన్నింటినీ
భరిస్తున్నది.మనకు అనేక ఖనిజాలనూ ఔషధాలనూ ఇస్తున్నది.చివరకు మనం పోతే
మనల్ని తనలో కలుపుకుంటున్నది.మనల్నే కాదు మనలను కన్నతల్లులనూ వారి తల్లులనూ
కూడా ఈ భూమే వారు బ్రతికున్నన్ని రోజులూ పోషించింది.చివరకు తనలోనే
వారికి విశ్రాంతినిచ్చింది.
No comments:
Post a Comment