29/05/17,
10:19:55 AM: KK: భౌతిక దేహానికి ఆహారం ఎటువంటిదో ,ఆధ్యాత్మిక జీవితానికి
ధ్యానం అటువంటిది.ధ్యానం చేయడం వలన మానవుడు అత్యంత శక్తిమంతుడు అవుతాడు.
ఏకాగ్రత తో అంతర్ముఖం అయినప్పుడు , బాహ్యమైన గందరగోళాల నుండి విముక్తమై,
అత్యధికమైన శక్తి ని సమకూర్చుకుని తన పనులు చేసుకోగలుగుతాడు. ఈ ధ్యానం
వలన ,నిగ్రహ శక్తి ప్రశాంతత అలవడుతుంది. ధ్యానం లో జీవిత క్రమాన్ని చూసే
వ్యక్తి సమయాన్నీ వ్యర్థం చేయడు.అతడి శక్తి అనవసరం గా వ్యర్థం కాదు. తనకి
లభించిన అవకాశాల్ని వ్యర్థం చేసుకొడు. అతడి లో అంతర్గతంగా సమస్త కార్య
కలాపాలు రూపు దిద్దుకుంటాయి. మనకి కనిపించేవి వాటి ప్రతి రూపాలు. అతడు
దివ్యమైన జీవితాన్ని పంచుకోగలుగుతాడు. ఈ కారణం గా అతడికి దివ్యసక్తి కూడా
లభిస్తుంది. ధ్యానం ఒక క్రియాత్మక జీవితాన్ని ప్రసాదిస్తుంది..అతడి వాక్కు
శక్తి మంతం అవుతుంది. ప్రతి పనీ లో ఒక క్రమత్వం పరి పూర్ణత్వం వస్తాయి...
ప్రియ మిత్రులకి శుభోదయం.
No comments:
Post a Comment