26/05/17,
1:17:07 PM: +91 98490 98554: *ప్రణవ నాదం:-- ప్రణవ నాదాన్నే అనాహత నాదం
అంటారు. అనగా ఆహతము కానిది, కొట్టబడనిది. శబ్దాలన్నీ ఒక వస్తువు
ఇంకొకవస్తువుతో తగిలితే వస్తాయి. కాని ప్రణవ నాదం స్వతఃసిద్ధము. కనుక
అనాహతము. ఈ శబ్దమును అనాహత ధ్వనిఅని కూడా అంటారు. ఇది పరమాత్ముని నాభి
స్థానం నుంచి నిరంతరమూ వస్తున్న ధ్వని గా యోగులు చెబుతారు. లోతైన ధ్యానములో
మునిగి ఉన్నపుడు ఈ నాదాన్ని తనలో తానె వినవచ్చు. శ్రీ రామకృష్ణులు దీనిని
"టాం......" అనే దీర్ఘ ధ్వనిగా ఉంటుంది అని చెప్పారు. గుడిలో గంట
మొగించినపుడు ఒక్క సారి కొట్టి వదిలితే ఆ ధ్వని "టాం....." అని దీర్ఘ
ధ్వనిగా వినిపిస్తూ చివరికి శూన్యంలో కలుస్తుంది. ఈ ధ్వని ఓంకార నాదానికి
చాలా దగ్గరగా ఉండే ధ్వని. అందుకే గుడిలో ఘంటా నాదం చెయ్యాలి.*
No comments:
Post a Comment