26/05/17,
11:42:38 PM: KK: *ఇంద్రియ వ్యామోహం తో కొందరు, దురహంకారం తో ఇంకొందరు,
బద్ధకంతో ఇంకొందరు, పిరికి తనం తో మరి కొందరు పరిస్థితుల ప్రభావం వల్ల
కొందరు-- ఇలా రకరకాలుగా ఏమీ సాధించలేని అప్రయోజకులుగా మారుతారు. వీటిని
వదిలించుకో గలిగితే మనిషిని విజయ లక్ష్మి ఏదో నాటికి వరిస్తుంది. యోగ
వాశిష్టం లో ఒక గొప్ప శ్లోకం ఉంది. దాని అర్థ భాగమే గొప్పఉత్తేజాన్ని
కలిగిస్తుంది. "దైవం నిహత్య కురు పౌరుష మాత్మ శక్త్యా" అని శ్రీ రామునికి
గురువైన వశిష్ట మహర్షిచెబుతాడు. ఓ శ్రీ రామా, పురుష ప్రయత్నానికి మించిన
ఉపాయం లేదు. కావున పౌరుషం తోనూ, ఆత్మ శక్తి తోనూ విధిని జయించు. అని
ప్రబోధిస్తాడు.*
*ఈ
విధం గా ఉత్సాహంతో ప్రయత్నం చేసే వారికి ప్రకృతిలో అన్నీలభిస్తాయి. అది
బాహ్యం గా కావచ్చు, అంతరికంగా కావచ్చు. ప్రయత్నశీలుడు ఏదోనాటికి తప్పక
విజయాన్నిపొందగలడు.ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. వాటిని అందుకునే వారే అరుదు.*
No comments:
Post a Comment