21/05/17, 9:59:07 AM: +91 98490 98554: 🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
*ॐ* *ఓం నమః శివాయ* *ॐ*
*ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ*🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
*🌷🌷హనుమజ్జయంతి (ఆదివారం, 21.05.2017)🌷🌷*
హనుమానంజనాసూనుః వాయుపుత్రోమహాబలః
రామేష్ఠః ఫల్గుణసఖః పింగాక్షోః అమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్
హనుమంతుడు
అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ
దాసుడు. అర్జునుని సఖుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు.
శతయోజన విస్తారమైన సముద్రమును దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి
శోకమును హరించినవాడు. ఔషధీ సమేతముగా ద్రోణాచలమును మోసుక వచ్చి యుద్ధమున
వివశుడైన లక్ష్మణుని ప్రాణములు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని
గర్వమును అణచినవాడు. హనుమంతుని ఈ నామములు నిదురించుటకు ముందు, ప్రయాణమునకు
ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.
జననం, బాల్యం
పుంజికస్థల
అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను
పెళ్ళాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. అప్పుడు
వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన
సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున
వాయుసుతుడనీ కూడా ప్రసిద్ధుడయ్యెను.
జన్మతః
బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు
అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన
వజ్రాయుధం తో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని
దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు
వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి, వాయుదేవుడు వీచటం
మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని
శాంతింప జేశారు.
ఆ తరువాత అధికంగా అల్లరి చేసే హనుమంతుని మునులు శపించడం వలన అతని శక్తి అతనికి తెలియకుండా అయింది.
విద్యాభ్యాసం
హనుమంతుడు
సూర్యునివద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన
రథంతో పాటుగా తానూ ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోను,
వ్యాకరణంలోను పండితుడయ్యాడు.నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి
పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి
అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునకిచ్చి వివాహం చేశాడనీ,
ఐనా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదనీ కూడా కథ.
స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:
తమలపాకుల దండ:
ఒక
కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము
చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేసారట, దగ్గరలో
పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని
చెప్తారు.
మల్లెలు:
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.
పారిజాతాలు:
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.
తులసి:
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది
కలువలు:
కలువ
పువ్వులు కూడా శ్రీరాములవారికి యెంతో ఇష్టమైన పూలు. భరతుని ఉన్న ఒక్క
కోవెల ఇరింజలకుడ, కేరళలో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం.
శ్రీరాములవారికి హనుమంతుడంటే భరతుడు మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత,
హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు
*🌷ప్ర(ప్ర)సన్నాంగరాగం🌷* ప్రభాకాంచనాంగం|
జగద్బీతిశౌర్యం తుషారాద్రిధైర్యమ్|
తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం|
భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రమ్!
భావము:
సూర్యుని
వంటి తేజస్సు కలవాడా, నిన్ను చూసి జగమే భీతి చెందుతుంది. రౌద్రం కలిగిన
రూపంతో రణంలో రాక్షసులను అంతమొందించావు, ధైర్యం కోసం నీ శరణే జొచ్చితిమి
స్వామి! అట్టి నీకు మా ప్రణామములు.
ఆంజనేయం మహావీరం 1 బ్రహ్మవిష్ణు శివాత్మకం
బాలార్క సదృశాభాసం 1 రామదూతం నమామ్యహమ్ 2
హనుమంతుడు
అంటేనే... బ్రహ్మ,విష్ణు, శివాత్మకమైన త్రిమూర్తాత్మక స్వరూపుడని,
సృష్టిస్థితి లయకారకుడని, రామదూత అని పేర్కొంటారు. ఇంట్లో ప్రతినిత్యం
భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తే... ఆ గృహంలో ఆంజనేయుని ప్రభావం వల్ల
లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని విశ్వాసం.
అదే
విధంగా... శ్రీరామ కీర్తనలు, శ్రీరామ భజనలు ఎక్కడ జరుగుతాయో... ఆ
ప్రాంతంలో ఆనంద భాష్పాలతో చిరంజీవి అయిన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతాడని
భక్తుల నమ్మకం.
అటువంటి
హనుమంత స్వామి వారికి "హనుమజ్జయంతి" నాడు విశేషపూజలు, శ్రీరామభజనలు,
సుందరకాండ, హనుమాన్ చాలీసా వంటి పారాయణం చేస్తే సకల సంపదలు ప్రాప్తిస్తాయని
శాస్త్రాలు చెబుతున్నాయి.
*🌷పంచముఖ హనుమాన్🌷*
శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరం ఇలా చెప్పబడింది.
* తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు.
* దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
* పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
* ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
* ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని , జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు
*🌷🙏హనుమాన్ జయంతి శుభాకాంక్షలు*🙏🌷
🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
*ॐ{శివ కింకరుడు దగ్గొలుమునేంద్ర }ॐ*🕉🌷🌷🌷🌷🙏🌷🌷🌷🌷🕉
No comments:
Post a Comment