29/05/17, 6:11:10 AM: +91 92462 72581: --------------శుభోదయం ---సూక్తులు--------------------------
కొడుకుల్ పుట్టరటంచు యేడ్చుదు రవివేకుల్ జీవన భ్రాంతులై
కొడుకుల్ల్పుట్టరె కౌరవేంద్రునకనేకుల్వారిచే నే గతుల్
పడసెన్ , పుత్రులు లేని యా శుకునకున్వాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రునకున్? శ్రీ కాళహస్తీశ్వరా! (ధూర్జటి కాళహస్తీశ్వర శతకం)
అర్థము:--జీవితం
శాశ్వత మనుకుంటూ వివేకాన్ని కోల్పోయి కొడుకులు పుట్టలేదని బాధపడుతుంటారు
కొందరు అవివేకులు. ధృతరాష్ట్రునికి వంద మంది కొడుకులు పుట్టారు. ఏమి
లాభం?వారివల్ల ఆయనకు సద్గతి లభించ లేదు సరికదా కొండంత అపకీర్తి లభించింది.
భాగవతోత్తము డయిన శుకమహర్షికి కొడుకులే లేరు. (ఆ జన్మ బ్రహ్మచారి) అయినా
ఆయన మోక్ష పదం చేరుకున్నాడు. అతనికి సద్గతి ప్రాప్తించింది. కాబట్టి కొడుకు
పుట్టాలనే వ్యామోహం చెందటం అనవసరం.
కులము లేనివాడు కలిమిచే వెలయును
గలిమిలేనివాడు కులము దిగును
గులముకన్నభువిని కలిమి ఎక్కువ సుమీ
విశ్వదాభిరామ వినుర వేమ
తక్కువ కులములో జన్మించిననూ ధనవంతుడైనచో గొప్పవాడుగనూ,గొప్ప కులములో
జన్మించిననూ దరిద్రుడైనచో హీనుడుగా చూడబడును. కావున లోకములో కులముకంటె
ధనమే ప్రధానమైనది..
శైలేశైలే న మాణిక్యం, మౌక్తికం న గజే గజే
సాధవో నహి సర్వత్ర, చందనం న వనే వనే
అర్థము:--ప్రతి
పర్వతము పైనా రత్నం దొరకదు.ప్రతి ఏనుగు కుంభ స్థలం లో ముత్యాలు
దొరకవు.(ఉత్తమ ఏనుగు కుంభస్థలం లో ముత్యాలు దొరుకుతాయని ప్రతీతి) .ప్రతి
అరణ్యం లోనూ చందనపు వృక్షాలు వుండవు.అలాగే సర్వత్రా (అన్ని చోట్లా)సజ్జనులు
లభించుట కష్టము.
అహో ప్రకృతి సాదృశం శ్లేష్మణో దుర్జనస్యచ
మదురై కోపమాయాతి కటుకై రుపశ్యామతి
అర్థము:--దుర్జనుడు శ్లేష్మ వ్యాధి వంటి వాడు. ఈ రెండింటి ప్రకృతి ఒక్కటే. తీపి తినడం వల్ల శ్లేష్మం
వృద్ధి
చెందుతుంది.చేదు మందు వల్లనే అది తగ్గుతుంది. దుర్జనుడితో కటువు గానే
వ్యవహరించాలి. మంచిగా మధుర మైన మాటలతో చెప్తే వాడు వినడు.
దైవాన్ని మెచ్చుకునే భజనలు కట్టిపెట్టు
దైవం మెచ్చుకునే పనులు మొదులు పెట్టు
కంటికి కనిపించే ప్రాణినే ప్రేమించ లేకపోతే
కంటికి కనిపించని దైవాన్నలా ప్రేమించ గలవు?
తిరుపతి లో ఏడుకొండలు కనిపిస్తాయేమో గానీ ఏడుకొండలవాడు కనిపించడు
హరిద్వార్ లో హరిద్వారాలు కనిపిస్తాయేమో గానీ హరి కనిపించడు.
దేవుని దర్శనానికి ధ్యాన మొక్కటే మార్గం.
నీ వెంట రాని ఇంటిని,ఒంటిని రోజూ కడుగుతావు,
నీ వెన్నంటి వచ్చే మనస్సు నెప్పుడు కడుగుతావు?
No comments:
Post a Comment