05/09/17, 1:47:23 PM: +91 79811 59026: *గురువు అంటే*
గురువు అంటే ధరణికి వెలుగు
గురువు అంటే దార్శనికతకు కొలువు
గురువు అంటే గుడిలో దైవం
గురువు అంటే గురుతర బంధం
గురువు అంటే ఉత్తుంగ తరంగం
గురువు అంటే ఉదయించే రవికిరణం
గురువు అంటే ఉరికే జలపాతం
గురువు అంటే ఉరిమే మేఘగర్జన
గురువు అంటే మెరిసే మెరుపు
గురువు అంటే మేదినికి మేలుకొలుపు!🙏🏼
No comments:
Post a Comment